Kavitha: రెండ్రోజులే టైమ్.. టెన్షన్‌లో కవిత!
ABN , Publish Date - Mar 19 , 2024 | 03:03 PM
MLC Kavitha Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) చిక్కులు తప్పేలా లేవు. సుప్రీంకోర్టు తీర్పుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కవితకు చుక్కెదరయ్యే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) చిక్కులు తప్పేలా లేవు. సుప్రీంకోర్టు తీర్పుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కవితకు చుక్కెదరయ్యే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. అరెస్ట్ చేయొద్దన్న పిటిషన్‌ను విత్ డ్రా చేసుకోగా.. మరో పిటిషన్లను సుప్రీంకోర్టు (Supreme Court) విచారిస్తుందని కవిత, బీఆర్ఎస్ (BRS) శ్రేణులు ఎన్నెన్నో ఊహించుకున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకే విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకూ జరగలేదు. కవిత తరపున వాదించాల్సిన సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబాల్ వేరే కోర్టులో బిజీగా ఉన్నందున 11 గంటలకు విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. వాయిదా పడిన ఈ విచారణ ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. ఒకట్రెండు రోజుల్లో విచారణ జరుగుతుందని వార్తలు వస్తున్నప్పటికీ వచ్చే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు.
Sukhesh Vs Kavitha: బయటపడే మార్గమే లేదక్కా.. కౌంట్‌డౌన్ మొదలైంది!
కష్టమే కవిత..!
ఈ రెండు మూడ్రోజుల్లో విచారణకు రాకుంటే ఆ తర్వాత మరో వారం రోజులపాటు కష్టమే. ఎందుకంటే.. ఈ నెల 23 నుంచి వారం రోజులపాటు సుప్రీంకోర్టుకు హోలీ సెలవులు ఉంటాయి. అంటే ఇంచుమించు ఏప్రిల్ మొదటి వారం వరకూ విచారణ కష్టమేనన్న మాట. దీనికి తోడు ఈడీ కస్టడీకి తీసుకుని ఇవాళ్టికి మూడోరోజు. ఇంకో నాలుగురోజులు మాత్రమే మిగిలుంది. అటు విచారణ జరగకపోతే.. ఇటు కస్టడీ అయ్యాక ఈడీ ఏం చేయబోతోంది..? మళ్లీ కస్టడీకి అడుగుతుందా..? నేరం రుజువైతే జైలుకు తరలిస్తారా..? అనేది తెలియాల్సి ఉంది. నేరం రుజువైతే మాత్రం తప్పకుండా.. మూడు నుంచి 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష తప్పదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కస్టడీలో ఈడీకి కావాల్సిన సమాచారం కవిత నుంచి రాకపోతే మరిన్ని రోజులు కస్టడీ పెంచాలని కోర్టును అధికారులు కోరే అవకాశం ఉంది. దీంతోఈ రెండ్రోజులే టైముంది.. ఏం తేలుతుందో..? సుప్రీంకోర్టులో విచారణకు రాకపోతే పరిస్థితేంటి..? అని కవిత, బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది.