Share News

Kavitha: ఎమ్మెల్సీ కవితకు కాస్త రిలీఫ్..!

ABN , Publish Date - Mar 17 , 2024 | 09:55 AM

MLC Kavitha ED Custody: అవును.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) కాస్త రిలీఫ్ దక్కింది.! వారం రోజుల పాటు కవితను ఈడీ కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే..

Kavitha: ఎమ్మెల్సీ కవితకు కాస్త రిలీఫ్..!

అవును.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) కాస్త రిలీఫ్ దక్కింది.! వారం రోజుల పాటు కవితను ఈడీ కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. శనివారం నాడు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో సుదీర్ఘంగా జరిగిన వాదనల అనంతరం.. ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే.. కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరగా సానుకూలంగా స్పందించింది. ‘ప్రతిరోజూ కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కవితను కలవొచ్చు. ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవచ్చు’ అని కోర్టు తెలిపింది. కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించగా, ఈడీ తరఫున న్యాయవాదులు, స్పెషల్‌ పీపీ ఎన్‌కే మట్టా, ఈడీ స్పెషల్‌ కౌన్సిల్‌ జోహెబ్‌ హుస్సేన్‌ వాదనలు వినిపించారు. కాగా.. ఇది కవిత రీలీఫేనని బీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. విచారణలో ఏం జరిగిందని తెలుసుకోవడానికి.. కవితకు ధైర్యం చెప్పడానికి వెసులుబాటుగా ఉంటుందని గులాబీ నేతలు చెబుతున్నారు. అయితే.. కచ్చితంగా న్యాయం గెలుస్తుందని.. కోర్టులపై తమకు నమ్మకం ఉందంటున్నారు.

Kavitha Arrest: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. క్లియర్‌ కట్‌గా చెప్పేసిన ఈడీ!



Kavitha-ED.jpg

హస్తినలో ఏం జరుగుతోంది..?

కాగా.. ప్రస్తుతం ఈడీ కస్టడీలోనే కవిత ఉన్నారు. కాసేపట్లో ఈడీ విచారణ ప్రారంభం కానుంది. కవిత స్టేట్మెంట్, విచారణ ప్రక్రియ మొత్తం ఈడీ అధికారులు వీడియో రికార్డు చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీలాండరింగ్‌పైనే ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారం రోజులపాటు కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనుంది. కవితను కలిసేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో.. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కలవనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, జాన్సన్‌ నాయక్‌ ఢిల్లీ బయల్దేరి వెళ్తున్నారు. కవిత అరెస్ట్ అయిన తర్వాత కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి.. అక్కడే ఉండి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. మరోవైపు.. కవిత భర్త అనిల్ కుమార్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం నాడు విచారణకు రావాలని.. అనిల్‌తో పాటు మరికొందరు నోటీసులు అందాయి. విచారణకు వెళ్లాలా..? వద్దా..? అనేదానిపై న్యాయనిపుణులతో అనిల్, కేటీఆర్ చర్చిస్తున్నారు.

Kavitha-Arrest.jpg

కవితకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2024 | 09:58 AM