Home » Delhi
జనసంఖ్య విషయంలో భారతదేశం చైనాను దాటేసి అగ్రస్థానానికి చేరుకుంది! అయినా.. ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునివ్వడం సంచలనం సృష్టించింది!!
పుణ్యనదుల్లో ఒకటైన యమునా నది జలాలు అత్యంత కలుషితంగా మారాయి. పరిశ్రమల నుంచి విడుదలైన వ్యర్థాలు నదిలో కలుస్తుండడంతో విషపు నురగలు తేలియాడుతున్నాయి. 90 శాతం వ్యర్థ జలాలు, 58 శాతం వ్యర్థాలు యమునా నదిలో కలుస్తున్నాయి. శుద్ది చేయని మురుగు నీటిని కూడా మయునలోకే వదులుతున్నారు.
‘‘మోదీ జీ తెలంగాణలో శనివారం కులగణన మొదలైంది. కులగణన లెక్కల ఆధారంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి విధానాలను రూపొందిస్తాం.
జస్టిస్ సంజీవ్ ఖన్నా... న్యాయ వ్యవస్థలో శిఖరాగ్రస్థానానికి చేరుకోనున్నారు. జిల్లా కోర్టులో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా కర్తవ్యాన్ని నిర్వహించనున్నారు.
‘సారీ నాన్నా! అమ్మను చంపేశా!’..ఓ తండ్రితో పెద్ద కుమారుడు అన్న మాటలవి. హత్యకు కారణం-కెనడా వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా, అందుకు మంత్రాలు వేస్తోందని అనుమానించడం... ఢిల్లీలో జరిగిన ఈ దారుణం కలవరపరిచింది.
అమెరికా ఆడవాళ్లకు అక్కడి మగాళ్లపై పీకల్దాక కోపమొచ్చింది. కమలా హారి్సను కాదని ట్రంప్కు ఓట్లేసి గెలిపించినందుకు పురుష పుంగవులపై లక్షల సంఖ్యలో మహిళామణులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
దేశంలోని ఉత్తర భారతదేశంలో చలి ప్రభావం పెరిగింది. ఇదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో తుపాను ప్రభావం ఉందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. దీంతో నేటి నుంచి నవంబర్ 14 వరకు వర్షాలున్నట్లు ఐఎండీ తెలిపింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
తిరుమల-తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం(యూటీ)గా మార్చాలన్న వినతిని శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. దేశంలోని కేదార్నాథ్, పూరీ జగన్నాథ్ వంటి పుణ్యక్షేత్రాలను కూడా ప్రత్యేక రాష్ట్రాలుగా చేయమంటారా?
పదవీ కాలం పూర్తయిన సందర్భంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ శుక్రవారం భావోద్వేగానికి లోనయ్యారు. విధి నిర్వహణలో నొప్పించి ఉంటే మన్నించాలని కోరారు. మరోవైపు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ అనుభవాలను గుర్తు చేసుకొని ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు.
వాయు కాలుష్యం కారణంగా దేశంలో ప్రతి ఏటా దాదాపు 33,000 మరణాలు సంభవిస్తున్నాయని లాన్సెట్ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనాన్ని NGT పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ఎన్జీటీలో నివేదికను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వ్యతిరేకించింది.