Home » Devotees
Mauni Amavasya: రానున్నది మౌని అమావాస్య. అత్యంత విశిష్టమైన రోజు. ఈ రోజు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అలాగే ఈ రోజు శ్రీమహావిష్ణువుతోపాటు శ్రీమహాలక్ష్మిని పూజించడం వల్ల అత్యంత శుభ ఫలితాలుంటాయి.
Tirumala: శ్రీవారిని దర్శించుకునేందుకు తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు తిరుమలకు వచ్చారు. అయితే నిషేధిత తినుబండారాలతో తిరుమలకు చేరుకున్నారు ఆ భక్తులు. ఈ క్రమంలో అలిపిరి తనిఖీ కేంద్రంలో భద్రతలోని డొల్లతనాన్ని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. తనిఖీ కేంద్రం దాటుకొని నిషేధిత ఆహారం ఎలా తిరుమలకు వచ్చిందంటూ భద్రతా సిబ్బందిని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు.
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏడు రోజుల్లో నాలుగు లక్షల 75 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. కాగా ఈ నెల 19వ తేది వరకు భక్తులకు టీటీడీ అధికారులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు.
నేటి నుంచి మహాకుంభ్‌లో రాగాల మేళా మొదలు కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కళాకారులు త్రివేణి సంగమం వద్ద కళా సాంస్కృతిక మహా కుంభం నిర్వహించనున్నారు. ఈరోజు నుంచి..
తిరుపతి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనం కొనసాగుతోంది. భక్తులు క్యూ లైన్లలో నిలుచుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో సంగం నది ఒడ్డున నిర్వహించబడుతున్న మహా కుంభమేళాలో ఈరోజు మూడవ రోజు. ఇప్పటి వరకూ 5.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు..
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులు క్యూ లైన్లలో నిలుచుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నెల 19వ తేది వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. మరోవైపు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకేన్ల జారీ కొనసాగుతోంది.
మహాకుంభామేళాకు వచ్చిన కొందరు సాధువులు తమ విచిత్ర వేషధారణ, ఆహార్యం, అలవాట్లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు 'IIT బాబా'గా పేరుగాంచిన ఒక సన్యాసి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐఐటీ బాంబేలో ఎయిర్ స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివి మసాని గోరఖ్ బాబాగా ఎలా మారాడన్న విషయం అంతటా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఒక సాధువు 32 ఏళ్లుగా స్నానం చేయలేదు.. మరొకరు 14 ఏళ్లుగా కుడిచేయి పైకి ఎత్తే ఉంచారు.. ఇంకొకరు 45 కిలోల రుద్రాక్ష తలపాగాతో కనిపిస్తారు. ఈ విచిత్ర సాధువులంతా మహా కుంభమేళాకు హాజరై భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు..