Home » District
కౌంటింగ్ రోజు దగ్గరపడే కొద్దీ టెన్షన పెరుగుతోంది. ఫలితాల కోసం ఎదురుచూసే అభ్యర్థులు, పార్టీలు, ఓటర్లది ఒక రకమైన టెన్షన కాగా.. కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులది మరో రకం టెన్షన. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల అధికారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ నాయకులు హింసాత్మక మార్గాలను ఎంచుకోవడమే దీనికి కారణమని కొందరు అంటున్నారు. కౌంటింగ్ రోజున తమకు అనుకూలంగా వ్యవహరించాలని ఒత్తిడి చేస్తున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది మొదలు...
శెట్టూరు మండలం ఐదుకల్లుకు చెందిన ముగ్గురు చిన్నారుల సంరక్షణ బాధ్యతలను ఐసీడీఎస్ అధికారులు తీసుకున్నారు. గ్రామానికి చెందిన చంద్రకళ, తిమ్మరాజు దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. తిమ్మరాజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చంద్రకళ ఇటీవల మరణించారు. దీంతో చిన్నారులు అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, ఇతర అధికారులు గురువారం గ్రామానికి వెళ్లారు. ఆరో తరగతి చదువుతున్న ప్రభాని(11), రెండో తరగతి ..
పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి గురువారం వసంతోత్సవం నిర్వహించారు. ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, ఉత్సవ నిత్యహోమం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఉద్భవ లక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలో అర్చకులు గుండూరావు, బాలాజీ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు చక్రస్నానం చేయించారు. అనంతరం అర్చకులు ఒకరిపై ఒకరు వసంతాలను...
తరిమెలలో వక్రమార్గంలో ఉపాధి బిల్లులు పొందిన ఇద్దరు ఉద్యోగుల నుంచి సొమ్ము రికవరీ చేస్తామని ఎంపీడీఓ బి.వెంకటరమణ, ఏపీఓ శ్రీదేవి తెలిపారు. ‘ఉద్యోగులు కూలీలట’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. తరిమెలకు వెళ్లి విచారించారు. ప్రభుత్వ ఉద్యోగులు..
ఎన్నికల నిధులను ఏమాత్రం సంకోచం లేకుండా కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడు ఓ అధికారి. వచ్చిన నిధులలో సగానికి పైగా మడతపెట్టేందుకు సిద్ధమయ్యాడు. పోలింగ్ సమయంలో చెలరేగిన అల్లర్లు ఆ అధికారికి వరంగా మారాయి. సందట్లో సడేమియా అన్నట్లు నిధులను మింగేయాలని చూస్తున్నాడు. గత ఎన్నికల నిర్వహణకు మంజూరైన రూ.12 లక్షల నిధులను కాజేసిన తరహాలోనే ఇప్పుడూ కాజేయాలని చూస్తున్నట్లు సిబ్బంది అనుమానిస్తున్నారు. 2019 ఎన్నికలకు సంబంధించి పెండింగ్ బిల్లులు రూ.12లక్షలు రెండు నెలల క్రితం విడుదలయ్యాయి. ఇవి పక్కదారి పట్టిన ...
పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం స్వామి వారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి సుప్రభాతసేవ, అర్చన, ఉత్సవ నిత్యహోమం నిర్వహించి, మంగళహారతులు పట్టారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన ...
ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పట్టణంలో ఎలాంటి గొడవలు, అల్లర్లు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. ...
రైతులకు నాణ్యమైన విత్తన వేరుశనగను మాత్రమే సరఫరా చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. గుత్తి రోడ్డులోని విజయ ఆగ్రో సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను బుధవారం ఆయన తనిఖీ చేసి, విత్తన నాణ్యత, మొలక శాతాన్ని పరిశీలించారు. ప్రాసెసింగ్ యూనిట్‌లో విత్తన వేరుశనగ నాణ్యతను వ్యవసాయ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. 30 కేజీల బస్తాలో 4 శాతం మాత్రమే సహజ సిద్ధమైన వ్యర్థాలు ఉండాలని, అంతకు మించి ఉండరాదని అన్నారు. విత్తనాలు 70 శాతం ...
చేసిన తప్పులు, అక్రమాలు బయటకు పొక్కడంతో స్కాంవీరులు దుప్పటి పంచాయితీకి వెళ్లారు. ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులను కలిసి లక్ష రూపాయల లంచం ఆఫర్ చేసినట్లు తెలిసింది. లక్షలకు లక్షలు స్వాహా చేసి.. ఓ లక్ష రూపాయలతో అధికారుల నోరు మూయించాలని ప్రయత్నించి.. విఫలమైనట్లు ప్రచారం జరుగుతోంది. గుంతకల్లు ఎంపీడీఓ కార్యాలయంలో గతంలో అభివృద్ధి పనుల నిధులు పక్కదారిపట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ...
పెన్నహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం మంగళవారం కన్నుల పండువగా సాగింది. అశేష భక్తజనం ‘నమో నారసింహా’ అని నినదిస్తుండగా.. స్వామివారి రథం ముందుకు సాగింది. బ్రహ్మోత్సవాలలో ప్రధానఘట్టమైన రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలలు, కర్ణాటక నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయంలో స్వామి వారికి ఉదయం ...