Share News

BILLS : రికవరీ చేస్తాం..!

ABN , Publish Date - May 31 , 2024 | 12:26 AM

తరిమెలలో వక్రమార్గంలో ఉపాధి బిల్లులు పొందిన ఇద్దరు ఉద్యోగుల నుంచి సొమ్ము రికవరీ చేస్తామని ఎంపీడీఓ బి.వెంకటరమణ, ఏపీఓ శ్రీదేవి తెలిపారు. ‘ఉద్యోగులు కూలీలట’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. తరిమెలకు వెళ్లి విచారించారు. ప్రభుత్వ ఉద్యోగులు..

BILLS : రికవరీ చేస్తాం..!
Officials are investigating the irregularities in Tarimela

శింగనమల మే 30: తరిమెలలో వక్రమార్గంలో ఉపాధి బిల్లులు పొందిన ఇద్దరు ఉద్యోగుల నుంచి సొమ్ము రికవరీ చేస్తామని ఎంపీడీఓ బి.వెంకటరమణ, ఏపీఓ శ్రీదేవి తెలిపారు. ‘ఉద్యోగులు కూలీలట’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. తరిమెలకు వెళ్లి విచారించారు. ప్రభుత్వ ఉద్యోగులు మనీష, మునిరాజు జాబ్‌కార్డు వివరాలను పరిశీలించారు. అక్రమంగా


లబ్ధిపొందినట్లు నిర్ధారించుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదించి, తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. శింగనమలలో ఉపాధి పనులను పరిశీలించారు. కూలీల నమోదులో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వెళ్లడంతో విచారించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 31 , 2024 | 12:26 AM