Home » Diwali
దీపావళి పండుగ సందర్భంగా అదనంగా మరోరోజు సెలవు పొడిగించడంతో ప్రభుత్వ కార్యాలయాలు, సెకండరీ స్కూళ్లన్నీ నవంబర్ 1న మూతపడతాయి. ఈ ఏడాది దీపావళి వేడుకలు అక్టోబర్ 31వ తేదీన మొదలై నవంబర్ 1వ తేదీ సాయంత్రం వరకూ కొనసాగుతాయి.
హిందూ ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్య.. ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలోకి వస్తుంది. అయోధ్యలోని భవ్య రామాలయం ఈ ఏడాది మొదట్లో ప్రారంభమైంది. దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారంనాడు దీపోత్సవ్ను ఘనంగా నిర్వహించనుంది.
ఇది హిందూ, ముస్లింలకు సంబంధించిన అంశంకాదని, పండుగ ప్రధాన స్ఫూర్తి దీపకాంతులను వెదజల్లడమే కానీ, పొగను వ్యాపింపజేయడం కాదని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాలుష్యం విషయానికి వచ్చినప్పుడు సంప్రదాయం కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు. దేశవ్యాప్తంగా మార్కెట్లు, మాల్స్, బంగారు, వెండి షోరూమ్లు ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తారు. కానీ ఈ కొనుగోళ్ల విషయంలో మాత్రం మధ్యతరగతి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ సూచనలు జారీ చేసింది. ఎందుకనేది ఇక్కడ చుద్దాం.
దీపావళి సందర్భంగా చిన్నపిల్లలు ఎంతో సందడిగా టపాసులు కాల్చడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. కాబట్టి పండగ వేళ, సంతోషకరమైన సమాయంలో కుటుంబాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. సురక్షితంగా దీపావళి జరుపుకునేందుకు నిపుణులు చూపిస్తున్న కొన్ని టిప్స్ ఇవే..
బిజినెస్ పరంగా దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న సంస్థ రిలయన్స్. దీపావళి వేళ.. ఆ సంస్థ ఉద్యోగులకు గిఫ్ట్లు బహుమతిగా అందజేసింది. అయితే గిఫ్ట్ ప్యాకెట్లలో ఏముందో చూపిస్తూ.. ఓ యువతి వీడియోలో వివరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. దీంతో నెటిజన్లు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
రకరకాల బొమ్మలు, ప్రమిదలు, మిరమిట్లు గొలుపే విదుత్ దీపాల అమ్మకాలతో మల్కాజిగిరిలోని ప్రధాన కూడళ్లలో సందడి నెలకొంది. దీపావళి(Diwali) పండుగను పురస్కరించుకుని ఇంటిముందు పెట్టే మట్టితో వివిధ ఆకృతులతో తయారు చేసిన ప్రమిదలు, దీపావళి రోజున ఇళ్లలో నిర్వహించుకునే బొమ్మల కొలువుకు సంబంధించిన వివిధ రకాల బొమ్మల అమ్మకాలు మార్కెట్లో జోరుగా సాగుతున్నాయి.
శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆస్థానం ఉంటుంది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి తిరుమాఢ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా 31న తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.
మహానంది క్షేత్రంలోని రాతి నందీశ్వరుడికి మంగళవారం సాయంత్రం వేదపండితులు ప్రదోషకాల పూజలు నిర్వహించారు.
దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకి. అలాంటి పండగ వేళ.. అమ్మవారిని పూజిస్తే చాలు సకల సంపదలు ఇస్తుంది. అమ్మవారు అష్టలక్ష్ముల రూపంలో దర్శనమిస్తారు. ఈ రూపాల్లో అమ్మవారిని దీపావళి వేళ పూజిస్తే మాత్రం అదృష్టం తలుపుతట్టినట్లేనని శాస్త్ర పండితులు చెబుతున్నారు.