Diwali 2024: ఆస్పత్రి వద్దకు బాధితుల క్యూ.. ఎందుకంటే
ABN , Publish Date - Nov 01 , 2024 | 07:44 AM
దీపావళి రోజున కొందరు నిర్లక్ష్యంగా ఉండటంతో ఆస్పత్రి పాలు కావాల్సి వచ్చింది. పటాకులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. చాలామందికి కళ్ల వద్ద గాయం అయ్యింది. దాంతో ఆస్పత్రికి క్యూ కట్టారు.
హైదరాబాద్: దీపావళి (Diwali 2024) పండగ కొందరి జీవితంలో విషాదం నింపింది. దివాళి రోజు పటాకులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. దాంతో ఆస్పత్రి పాలు కావాల్సి వచ్చింది. బాణా సంచా కాల్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, కాటన్ దుస్తులు ధరించాలని వైద్య నిపుణులు సూచించారు. కొందరు పెడ చెవిన పెట్టారు. దాంతో ప్రమాదానికి గురికావాల్సి వచ్చింది. హైదరాబాద్‌లో గల సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి బాధితులు క్యూ కట్టారు. శుక్రవారం ఉదయం వరకు పదుల సంఖ్యలో బాధితులు హాస్పిటల్‌కు వచ్చారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
కళ్లకు గాయం..
దివాళి అంటేనే పటాకులు కాల్చి ఆనందంగా గడపడం. గతంలో చిన్న చిన్న బాణా సంచా ఉండేవి. తర్వాత చైనా పటాకులు వచ్చేశాయి. ఎక్కువ శబ్ధం, మిరుమిట్లు గొలిపే కాంతి వచ్చాయి. వాటిని కొనుగోలు చేసేందుకు వేలు ఖర్చు చేసి వెనకాడటం లేదు. అదే సమయంలో జాగ్రత్తగా ఉండటం లేదు. దాంతో చాలా మంది కళ్లకు గాయాలు అవుతున్నాయి. మరికొందరికీ చేతులు, కాళ్లకు గాయమై రక్తం వచ్చిన పరిస్థితి నెలకొంది. కంటి చూపుపై ప్రభావం చూపిన చాలా మంది సరోజినీ దేవి ఆస్పత్రికి వచ్చారు. నిన్న (గురువారం) అర్ధరాత్రి నుంచి ఆస్పత్రికి క్యూ కట్టారు. శుక్రవారం ఉదయం బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటి వరకు 40 మందికి చికిత్స అందించామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
పెరుగుతున్న రోగులు
సమయం గడుస్తోన్నా కొద్దీ బాధితులు పెరుగుతున్నారు. రోగుల సంఖ్య పెరగడంతో మరిన్ని ఎమర్జెన్సీ వార్డులను సిద్దం చేశారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఆస్పత్రిలో సెలవులో ఉన్న వారినిరప్పించారు. పటాకులు కాల్చి గాయపడ్డ వారికి మెరుగైన వైద్య చికిత్స అందజేస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి:
TG Govt: దీపావళి నాడు మరో శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం ..ఏంటంటే..