Home » DK Aruna
కమలం వికసించింది.. కాంగ్రెస్ మురిసింది.. గులాబీ వాడింది. తెలంగాణలో కమలం, హస్తం పార్టీలు ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ సాధించాయి. ఓట్లు, సీట్లలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. నాలుగు నుంచి ఎనిమిది సీట్లకు పెరగడంతోపాటు ఓట్ల శాతమూ21 శాతానికి ఎగబాకింది. అధికార కాంగ్రెస్ కూడా ఎనిమిది సీట్లలో విజయకేతనం ఎగరేసింది. పదేళ్లపాటు రాష్ట్రంలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ మాత్రం ఈసారి బొక్కబోర్లా పడింది.
ఉమ్మడి పాలకుల కంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కువ మోసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. బీజేపీ నేత డీకే అరుణకు గుర్తింపు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. నేడు పాలమూరు జిల్లాలో పర్యటించిన మోదీ పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా గురించి మాట్లాడకపోవడం బాధాకరమని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావట్లేదని పదే పదే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ హామీలు రాష్ట్రంలో ఎక్కడ అమలవుతున్నాయో నిరూపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి(CM Revanth Reddy) మరోసారి సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు రేవంత్ ప్రతి సవాల్ విసిరారు.
రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి ఈ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలని తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొత్తకోటలో కార్నర్ మీటింగ్‌లో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పావులు కదుపుతున్నారు. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
కాంగ్రెస్ (Congress) హయాం మొత్తం స్కామ్‌లేనని ఎమ్మార్పీఎస్ అభ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) ఆరోపించారు. ఆదివారం నాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ, బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ హాజరయ్యారు.
Telangana: ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక సీఎం మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో పర్యటించారని.. మహిళా అన్న ఇంగితలేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు ముప్పేటదాడి చేస్తున్నారని.. సోయిలేకుండా రాక్షరాసులు.. రాబంధువులలాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఏది మాట్లాడినా కేసీఆర్ లాగా అరుణమ్మ ఊరుకుంటుందని అనుకుంటువ్నానా’’ అంటూ విరుచుకుపడ్డారు.
నేటి నుంచి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. నామినేషన్ కార్యక్రమాలను గ్రాండ్‌గా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీ అభ్యర్ధుల నామినేషన్లకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. బీజేపీ నుంచి నేడు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘనందనరావు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర జరుగుతోందని, తనను కింద పడేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం కొడంగల్‌కు సోమవారం సీఎం రేవంత్ వచ్చారు. అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
బీజేపీ (BJP) సీనియర్ నేత డీకే అరుణ(DK Aruna) వల్లే పాలమూరులో కరువు పరిస్థితులు వచ్చాయని టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత(Kalva Sujatha) అన్నారు. రాజకీయాలతో డీకే అరుణ, ఆమె కుటుంబం బాగుపడింది తప్ప పాలమూరు జిల్లాకు ఎలాంటి లాభం కలగలేదని చెప్పారు.