Home » Donald Trump
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవటంతో ముందుకొచ్చిన కమలా హ్యారిస్.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించి చరిత్ర సృష్టించే అవకాశం ఉందని ప్రీపోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాయిటర్స్, ఇప్సాస్ సంస్థలు మంగళవారం నిర్వహించిన పోల్‌లో..
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలగడమే కాకుండా, కోవిడ్ బారిన కూడా పడిన జో బైడెన్ వారం రోజుల తర్వాత తొలిసారి బహిరంగంగా కనిపించారు. కోవిడ్ నుంచి కోలుకున్న బైడెన్ తాజాగా వైట్‌హౌస్‌కు చేరుకున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడంతో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ ఎంట్రీ ఇచ్చారు.
నరేంద్ర మోదీ, జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, బరాక్ ఒబామా.. వీళ్లంతా ప్రపంచస్థాయి నాయకులు. నిత్యం సంప్రదాయ దుస్తులతో దర్శనమిస్తూ ఉంటారు. వీళ్లంతా ఒకరోజు ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టి.. ఒకే వేదికపై అదిరేటి డ్రెస్సులతో ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది..?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా(Michelle Obama)ను బరిలో నిలుపుతారనే ఊహాగానాలు బలపడుతున్నాయి. పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించిన తరువాత మిషెల్ ఒబామా పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.
వైట్ హౌస్ రేసు నుండి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama) ప్రశంసించారు. బైడెన్ తీసుకున్న నిర్ణయం దేశంపై ఆయనకున్న ప్రేమను చాటుతోందని ఒబామా వ్యాఖ్యానించారు.
భారతీయ మూలాలున్న కమలా హారిస్(Kamala Harris) అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ 2024 అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని నిర్ణయించగా, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
వచ్చే నవంబర్ నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో(us presidential election 2024) ఇప్పటివరకు పోటీలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ట్విస్ట్ ఇచ్చారు. ఈ పోటీ నుంచి తాను వైదొలుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఆగంతకుడి కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ శనివారం తొలి ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. కాల్పుల దాడి తర్వాత ట్రంప్‌కు ప్రజాధారణ భారీగా పెరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయావకాశాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో ట్రంప్ అధ్యక్ష పదవి చేపడితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, ప్రాజెక్ట్ 2025 అమలు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లపైనే అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ రెండు దేశాలు పరస్పర దాడులతో ఈ యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తూనే ఉన్నాయి.