Share News

Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్.. బరిలోకి భారత సంతతి వ్యక్తి

ABN , Publish Date - Jul 22 , 2024 | 07:14 AM

వచ్చే నవంబర్ నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో(us presidential election 2024) ఇప్పటివరకు పోటీలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ట్విస్ట్ ఇచ్చారు. ఈ పోటీ నుంచి తాను వైదొలుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్.. బరిలోకి భారత సంతతి వ్యక్తి
Joe Biden dropped

వచ్చే నవంబర్ నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో(us presidential election 2024) ఇప్పటివరకు పోటీలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ట్విస్ట్ ఇచ్చారు. ఈ పోటీ నుంచి తాను వైదొలుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దేశం, డెమోక్రటిక్ పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. 81 ఏళ్ల బైడెన్ స్థానంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌(59)కు(kamala harris) మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. మా పార్టీ అభ్యర్థిగా కమలకు పూర్తి మద్దతు ఇస్తున్నానని, డెమోక్రాట్లు ఏకతాటిపైకి వచ్చి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.


కారణమిదేనా..

అనేక విమర్శల తర్వాత ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) అధ్యక్ష అభ్యర్థి పోటీ నుంచి వైదొలిగారు. గతంలో ట్రంప్‌తో పలుమార్లు జరిగిన చర్చలలో తప్పులు తప్పులుగా మాట్లాడటంతో విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం అధ్యక్ష రేసులో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. డెమోక్రటిక్ పార్టీ నుంచి కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్, మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్, పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరోలతో పాటు మరో ఆరు పేర్లు కూడా అధ్యక్ష రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ తమ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తుందో చూడాలి.


తదుపరి అభ్యర్థి

అయితే కమలా హారిస్‌(kamala harris)ను అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ ప్రకటించిన తర్వాత ఆమె అధ్యక్ష అభ్యర్థి కావడం దాదాపు ఖాయమైందని చెప్పవచ్చు. డెమోక్రటిక్ పార్టీ(democratic party) అభ్యర్థి ఎంపిక కమిటీ అధ్యక్ష పదవికి తదుపరి అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఆగస్టులో జరగనున్న కన్వెన్షన్‌లో కమలా హారిస్‌ను డెమోక్రటిక్ పార్టీ నామినేట్ చేస్తే, వైట్‌హౌస్‌కు నామినేషన్‌ను గెలుచుకున్న మొదటి భారతీయ-అమెరికన్ అవుతుంది. తాను అధ్యక్ష పదవి కోసం పోటీ చేయడం గౌరవంగా భావిస్తున్నానని, ఈ నామినేషన్‌ను కొనసాగించి గెలవాలని భావిస్తున్నానని కమలా హారిస్ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

Benjamin Netanyahu: అలా చేస్తే భారీ మూల్యం తప్పదు.. ఇజ్రాయెల్ ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్


8 ఐపీఓలు.. 8 లిస్టింగ్‌లు

Read More international News and Latest Telugu News

Updated Date - Jul 22 , 2024 | 07:21 AM