Home » Drugs Case
తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసులో (Radisson Hotel Drugs Case) తాజాగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. మాధాపూర్ డీసీపీ వినీత్ (DCP Vineeth) ఈ కేసు వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడిస్తూ.. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. తాము డ్రగ్ పెడ్లర్ అబ్బాస్‌ను అదుపులోకి తీసుకున్నామని.. 10 సార్లు వివేకానందకు అతడు కొకైన్ (Cocaine) డెలివరీ చేశాడని తెలిపారు.
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పలువురు సెలబ్రేటిలపై కేసు నమోదైంది. సినీ నటి లిషి గణేష్, శ్వేత పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. డ్రగ్స్ పార్టీకి లిషి గణేష్ వెళ్లినట్లు గుర్తించారు. ఎఫ్ఐఆర్లో ఆమెతోపాటు మరో సెలబ్రేటి శ్వేతా పేరును కూడా నమోదు చేశారు.
రాడిషన్ హోటళ్లో డ్రగ్స్‌తో పట్టుబడిన వీఐపీల కేసు ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి. ఈ పార్టీలో 10మందిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.
నేడు గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌పై పోలీసులు జరిపిన దాడిపై సీపీ అవినాష్ మహంతి వివరాలను వెల్లడించారు. రాడిసన్ బ్ల్యూ హోటల్‌పై ఎస్ఓటీ పోలీసులతో దాడి చేశామని సీపీ తెలిపారు. హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో సెర్చ్ చేశామన్నారు. అప్పటికే హోటల్ నుంచి నిందితులు పరారు అయ్యారన్నారు.
డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు పోలీసులు ఎంతలా ప్రయత్నిస్తున్నా కూడా అది సాధ్యపడటం లేదు. గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో కొందరు యువకులు గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. వారిలో ఒక ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నాడు.
మన భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ‘డ్రగ్ రాకెట్’ (Drug Racket) ఒకటి. దీనిని నిర్మూలించేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఇల్లీగల్‌గా ఈ దందా నడుస్తూనే ఉంది. ఈమధ్య కాలంలో ఇది మరింత విస్తరించడంతో.. అధికారులు ప్రత్యేక ఆపరేషన్స్ నిర్వహించి, డ్రాగ్ రాకెట్ నెట్‌వర్క్‌లను ఛేధిస్తున్నారు. తాజాగా మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది.
Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో నమోదైన డ్రగ్స్ కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టులో ఎక్సైజ్ శాఖకు ఎదురుదెబ్బ తగిలింది.
టాలీవుడ్‌ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద భూతాల్లో ‘డ్రగ్స్ దందా’ ఒకటి. దీనిని ఇండస్ట్రీ నుంచే కాదు, తెలంగాణ నుంచే పూర్తిగా నిర్మూలించాలని అధికారులు సాయశక్తులా ప్రయత్నిస్తున్నా.. చాపకింద నీరులా ఈ డ్రగ్స్ దందా కొనసాగుతూనే ఉంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల్లో కొందరు ఈ దందాని అత్యంత రహస్యంగా నడుపుతున్నారని ఇదివరకే కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి.
నార్సింగి లావణ్య డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చిన లావణ్య జల్సాలకు అలవాటు పడింది.