TS News: రాడిసన్ డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కైన సినీ నటులు..
ABN , Publish Date - Feb 27 , 2024 | 08:10 AM
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పలువురు సెలబ్రేటిలపై కేసు నమోదైంది. సినీ నటి లిషి గణేష్, శ్వేత పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. డ్రగ్స్ పార్టీకి లిషి గణేష్ వెళ్లినట్లు గుర్తించారు. ఎఫ్‌ఐఆర్‌లో ఆమెతోపాటు మరో సెలబ్రేటి శ్వేతా పేరును కూడా నమోదు చేశారు.
హైదరాబాద్: రాడిసన్ హోటల్ (Radison Hotel) డ్రగ్స్ కేసు (Drugs Case)లో పలువురు సెలబ్రేటిలపై కేసు నమోదైంది. సినీ నటి లిషి గణేష్, శ్వేత పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR)లో చేర్చారు. డ్రగ్స్ పార్టీకి లిషి గణేష్ వెళ్లినట్లు గుర్తించారు. ఎఫ్‌ఐఆర్‌లో ఆమెతోపాటు మరో సెలబ్రేటి శ్వేతా పేరును కూడా నమోదు చేశారు. గతంలో లిషి గణేష్ సోదరి కూడా డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూట్యూబర్స్‌గా లిషిగణేష్, సుసితా ఫేమస్ అయ్యారు. లిషిగణేష్‌ను కూడా పిలిచి విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే..
గచ్చిబౌలి (Gachibowli)లో డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. రాడిసన్ హోటల్ (Radison Hotel)లో సదరు యువకులు గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. వారిలో ఒక ప్రముఖ బీజేపీ (BJP) నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నాడు. ఈ పార్టీలో డ్రగ్స్, మద్యం ఏరులై పారినట్టు తెలుస్తోంది.
యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు. పోలీసులు పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్‌పై దాడి చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు బీజేపీ నేత కుమారుడు కూడా ఉన్నారు. 2009లో శేరిలింగంపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన యోగానంద్ కుమారుడు వివేకానంద రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డాడు. హోటల్ కూడా యోగానంద్‌దేనని తెలుస్తోంది. మూడు రోజులుగా ఈ ముగ్గురూ పార్టీ చేసుకుంటున్నట్టు సమాచారం. ముగ్గురు యువకులనూ పోలీసులు విచారిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.