Home » Duddilla Sridhar Babu
సాఫ్ట్ట్వేర్ కంపెనీలు, పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం అనుకూలంగా ఉందని, అందుకే అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ఐటీ పార్కులకు తోడు తూర్పువైపు మరో ఐటీ పార్కు తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
స్సీల వర్గీకరణ అమలు కోసం ఒక ఉప కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి దామోదర రాజనర్సింహా నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని అనుకుంటోంది.
బంగారం, వెండి వస్తువుల తయారీ పరిశ్రమలను తెలంగాణలో ఏర్పాటు చేసి తరతరాలుగా ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న స్వర్ణకారులకు,
‘‘రాష్ట్ర వ్యవసాయ రంగానికి, రైతులకు మేలు చేసేలా పెట్టుబడులు పెట్టేందుకు వస్తే ముఖ్యమంత్రి సోదరుడికి లబ్ధి కలిగిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పరంగా పొరుగు రాష్ట్రాలతోనో, మరే ఇతర రాష్ట్రాలతోనో పోటీ పడటం కాదని, ప్రపంచంతోనే పోటీ పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు చెందిన మరో క్యాంపస్ హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది. కోకాపేటలోని బహుళ అంతస్తుల జీఏఆర్ టవర్‌లో 10 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించనున్నారు.
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది.
ఇప్పటికే మూడు డేటా సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ (ఏడబ్ల్యూఎస్).. పెట్టుబడులను మరింత విస్తరించడంతోపాటు, నాలుగో డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధమైంది.
తెలంగాణకు ‘ఫ్యూచర్ స్టేట్’ అనే ట్యాగ్‌లైన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. ఈ ఫ్యూచర్ స్టేట్ ప్రాజెక్టుల్లో భాగస్వామి అయ్యేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం అడోబ్ సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది.