Home » ED raids
మహేష్ కో-ఆపరేటీవ్ బ్యాంకులో రూ.300 కోట్ల నిధుల గోల్‌మాల్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లోని నిజాంపేటలో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (MLA Goodem Mahipal Reddy) నివాసాల్లో ఈడీ అధికారులు ఈరోజు(గురువారం) సోదాలు చేసిన విషయం తెలిసిందే. గతంలో లక్డారం గనుల వ్యవహారంలో వీరిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
తెలంగాణలో ఈడీ సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఎన్నికల ముందు వరకు ఐటీ, ఈడీ సోదాలతో తెలంగాణ రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే. ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా ఈడీ సోదాలతో తెలంగాణ రాజకీయం ఆసక్తిరేపుతోంది.
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులోని నిందితుల జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా చేర్చుతామని ఈడీ మంగళవారం హైకోర్టుకు తెలిపింది.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జార్ఖండ్(Jharkhand)లో పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేస్తున్న క్రమంలో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం(Alamgir Alam) వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న సంజీవ్ లాల్ సహాయకుడి ఇంట్లో నుంచి భారీ మొత్తంలో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Meka Sravan ED: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ మరో మూడ్రోజులకు పొడిగించిన సంగతి తెలిసిందే. అటు సోదాలు.. ఇటు రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో కవిత రిమాండ్ రిపోర్టును ఈడీ విడుదల చేసింది. ఈ రిపోర్టులో ఈడీ కీలక విషయాలను ప్రస్తావించింది. తాజా ఈడీ అఫిడవిట్‌తో కొత్త పేరు తెరపైకి వచ్చింది..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అరెస్ట్‌కు నిరసనగా రేపు అన్ని నియోజక వర్గాలల్లో ఆందోళనలకు ఆ పార్టీ పిలుపును ఇచ్చింది. కవితనుఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. అయితే ఈ విషయంపై మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత (MLC Kavitha) ఇంట్లో శుక్రవారం ఈడీ, ఐటీ అధికారులు రైడ్స్ (ED Raids) చేపట్టారు . ఢిల్లీ నుంచి వచ్చిన పదిమంది అధికారుల బృందం కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది. కవిత, ఆమె సహాయకుల సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంటసేపటి నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఇటివల చేసిన తనిఖీల్లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు నేతల వద్ద చేసిన తనిఖీల్లో కోట్ల రూపాయల నగదుతోపాటు 300 తుపాకులు, బంగారం సహా విదేశీ ఆస్తులు కూడా లభ్యమయ్యాయి.
మంచిర్యాలలోని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వివేక్ ( Vivek Venkataswamy ) నివాసంలో ఉదయం 5గంటల నుంచి ఐటీ-ఈడీ బృందాలు సోదాలు నిర్వహించింది. వివేక్ సహా కుటుంబ సభ్యులను ఐటీ-ఈడీ అధికారులు విచారించారు.