Share News

CM Ramesh: త్వరలో వారి బండారాలన్నీ బయటపడతాయి.. సీఎం రమేష్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Oct 19 , 2024 | 03:32 PM

వైసీపీ నేతల అక్రమార్జనలపై ఈడీ , సీబీఐలకు తాను ఫిర్యాదు చేశానని ఎంపీ సీఎం రమేశ్ వెల్లడించారు. త్వరలో జగన్‎తో పాటు వైసీపీ అక్రమార్కుల బండారాలన్నీ బయటపడతాయి ... ఇది ఆరంభం మాత్రమేనని సీఎం రమేశ్ పేర్కొన్నారు.

CM Ramesh: త్వరలో వారి  బండారాలన్నీ బయటపడతాయి.. సీఎం రమేష్ షాకింగ్ కామెంట్స్

విశాఖపట్నం: విశాఖపట్నంలో వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిపై ఈరోజు జరుగుతున్న ఈడీ సోదాలు ప్రారంభం మాత్రమేనని.. ఇంకా కొనసాగుతాయని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. వైసీపీ నేతలు దోచుకున్న అవినీతి సొమ్ము మొత్తం కక్కించి ప్రజల కోసం ఉపయోగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వైసీపీ నేతల అక్రమార్జనలపై ఈడీ , సీబీఐలకు తాను ఫిర్యాదు చేశానని ఎంపీ సీఎం రమేశ్ వెల్లడించారు. త్వరలో మాజీ సీఎం జగన్‎తో పాటు వైసీపీ అక్రమార్కుల బండారాలన్నీ బయటపడతాయి ... ఈడీ దాడులు ఆరంభం మాత్రమేనని సీఎం రమేశ్ పేర్కొన్నారు.


మధురవాడ భూమి కొనుగోలు కేసులో ఈడీ సోదాలు...

కాగా.. మాజీ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ(MVV Satyanarayana) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ డైరెక్టరేట్(ED) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మధురవాడ భూమి కొనుగోలు కేసులో తనిఖీలు చేపట్టిన అధికారులు ఏకకాలంలో పలు చోట్ల సోదాలు చేస్తున్నారు. విశాఖ లాసన్స్‌బే కాలనీలోని ఎంవీవీ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాజీ ఎంపీ సత్యనారాయణతోపాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలోనూ సోదాలు సాగుతున్నాయి. హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్‌, కన్‌స్ట్రక్షన్స్‌ కార్యాలయాల్లోనూ ఈడీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. రూ.12.5 కోట్ల లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంలో ఎంవీవీపై ఈడీ ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

mvv-satyanarayana.jpg


పలు చిత్రాలు నిర్మించిన ఎంవీవీ సత్యనారాయణ

కేసు విచారణలో భాగంగా ఈడీ బృందాలు సోదాలు చేపట్టాయి. మరోవైపు హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్‌ ఓనర్‌ రాధారాణి, కంపెనీ ఎండీ జగదీశ్వరుడు ఇళ్లల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. 2006-2008 మధ్య జరిగిన లావాదేవీలపై ఈడీ కేసు నమోదు చేయగా.. తాజాగా ఎంవీవీ ఆడిటర్‌ వెంకటేశ్వరరావుతోపాటు గద్దె బ్రహ్మాజీ ఇళ్లల్లోనూ సోదాలు చేస్తున్నారు. అధికారులు ఎంవీవీ ఇంటికి తాళాలు వేసి మరీ తనిఖీ చేపట్టారు. అయితే మాజీ ఎంపీ ప్రస్తుతం ఇంట్లో లేరని అధికారులు చెబుతున్నారు. అయితే మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలుగులో పలు చిత్రాలు నిర్మించారు. గీతాంజలి, అభినేత్రి, నీవెవరు సినిమాలను ఆయన నిర్మించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Visakha: మాజీ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు..

ABN Effect: విశాఖ శారదా పీఠంకు కేటాయించిన స్థలంపై సర్కార్ కీలక నిర్ణయం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 19 , 2024 | 03:45 PM