Home » ED Summons
ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజిమెంట్ యాక్ట్ ఉల్లంఘన కేసులో సోమవారంనాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కావాల్సిన టీఎంసీ నేత, లోక్‌సభ మాజీ ఎంపీ మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. తనకు 3 వారాలు సమయం కావాలని ఈడీని ఒక లేఖలో ఆమె కోరారని, అంత గడువు ఇవ్వడానికి ఈడీ నిరాకరించిందని సమాచారం.
భూ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో మనీల్యాండరింగ్ కోణంలో ప్రశ్నించేందుకు తొమ్మిది సార్లు నోటీసులు పంపించినా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించకపోవడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఢిల్లీలోని హేమంత్ సోరెన్ నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. సీఎం పదవితో పాటు జేఎంఎం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ఉన్న హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనకు పంపిన నోటీసులపై ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమైనవని, రాజకీయంగా ప్రేరేపించినవని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
‘న్యూస్‌క్లిక్ టెర్రర్ కేసు’లో (NewsClick terror Case) వ్యాపారవేత్త, అమెరికన్ మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్‌కు ఈడీ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. భారత్‌లో చైనా అనుకూల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.