Arvind Kejriwal: ఈడీ నోటీసులు చట్ట విరుద్ధం.. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 21 , 2023 | 10:58 AM
దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనకు పంపిన నోటీసులపై ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమైనవని, రాజకీయంగా ప్రేరేపించినవని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
ఢిల్లీ: దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనకు పంపిన నోటీసులపై ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమైనవని, రాజకీయంగా ప్రేరేపించినవని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ’’నేను ప్రతి చట్టపరమైన నోటీసులను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఈడీ పంపిన నోటీసులు చట్ట విరుద్ధం, గతంలో మాదిరిగానే రాజకీయంగా ప్రేరేపించినవి. నోటీసులను ఉపసంహరించుకోవాలి. నేను నా జీవితాన్ని నిజాయితీగా, పారదర్శకంగా గడిపాను. నేను దాచడానికి ఏమి లేదు.’’ అని తెలిపారు. కాగా ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో గురువారం తమ ముందు విచారణకు హాజరు కావాలని సోమవారం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు పంపింది.
కానీ ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. గురువారం ఈడీ ముందు విచారణకు కేజ్రీవాల్ హాజరుకాలేదు. కాగా మొదటగా నవంబర్ 2న కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు పంపింది. కేజ్రీవాల్ అరెస్ట్ కాబోతున్నారనే ప్రచారం కూడా ఒకానొక దశలో తెరపైకి వచ్చింది. కానీ ఈడీ నోటీసులు అస్పష్టంగా ఉన్నాయని, చట్ట విరుద్దమైనవని, రాజకీయ ప్రేరణతోనే పంపినవిగా పేర్కొంటూ ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో మరోసారి నోటీసులు పంపింది. కాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రశ్నించడంతోపాటు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు విచారణకు హాజరుకావాలని ఆయనకు ఈడీ నోటీసులు పంపింది.