Home » ED
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను తాము కోరుకోవడం లేదని తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి అనూహ్యంగా మలుపు తిరిగింది. గత కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న ఈ కేసు ఉన్నపలంగా తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు (BRS MLC Kavitha) తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపే
అక్షయ గోల్డ్ కుంభకోణంపై (Akshaya Gold scam) ఈడీ (ED) ఛార్జిషీట్ దాఖలు చేసింది.
నోటీసులు అనేవి రొటీన్ చర్యగా అభివర్ణించారు. ఇది వరకే ఈడీ అడిగిన డాక్యుమెంట్స్ మొత్తం అందించినట్లు తెలిపారు. లావాదేవీల విషయంలో పారదర్శకంగా ఉంటామని వివరించారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్‌లో ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈఎస్ఐలో దాదాపు రూ.211 కోట్ల స్కాం జరిగినట్లు ఈడీ నిర్ధారించింది. ఏసీబీ నమోదు చేసిన ఎనిమిది ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేసింది.
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఛీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా (Sanjay Kumar Mishra) పదవికాలాన్ని 15 సెప్టెంబర్ 2023 వరకు పొడగింపునకు సుప్రీంకోర్ట్ (Supreme Court) అనుమతిచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తికి అత్యున్నత న్యాయస్థానం అంగీకారం తెలిపింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే కేంద్రం విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నట్టు కోర్ట్ తెలిపింది.
కామినేని గ్రూప్‌పై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కామినేని గ్రూప్ చైర్మన్, ఎండీ నివాసాలపై సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణలో మొత్తంగా 15 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్‌లో సైతం సోదాలు జరుగుతున్నాయి. అలాగే మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాలలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. షామీర్పేటలోని మెడిసిటీ కళాశాలలో ఏరియా అధికారులు సోదాలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవలే పలువురు బీఆర్ఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులను ఈడీ నిర్వహించిన విషయం తెలిసిందే. వారిని విచారణకు సైతం రమ్మంటూ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుంచి ఈడీ అధికారులు 11 బృందాలుగా వెళ్లారు. భారీగా సీఆర్పీఎఫ్ బలగాలతో ఈడీ బృందాలు బయలుదేరాయి.
హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. టి.వెంకట్రామి రెడ్డి, పీకే అయ్యర్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. డీసీ ఆడిటర్ మనీ ఊమెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. కెనరా, ఐడీబీఐ బ్యాంకులను మోసం చేసిన కేసులో అరెస్ట్ చేయడం గమనార్హం.