MLC Kavitha: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్
ABN , Publish Date - May 20 , 2024 | 07:53 AM
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే నేడు కవితను అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ నేటితో రిమాండ్ ముగుస్తోంది. నిజానికి కవిత బెయిల్ కోసం ఆమె తరుఫు న్యాయవాదులు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి పలుమార్లు ఆమెకు బెయిల్ రిజెక్ట్ అయ్యింది.
ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే నేడు కవితను అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ నేటితో రిమాండ్ ముగుస్తోంది. నిజానికి కవిత బెయిల్ కోసం ఆమె తరుఫు న్యాయవాదులు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి పలుమార్లు ఆమెకు బెయిల్ రిజెక్ట్ అయ్యింది. ఈసారి మరి న్యాయస్థానం కవితకు రిమాండ్ పొడిగిస్తుందా? లేదంటే బెయిల్ ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
AP News: ఆటో డ్రైవర్, కారు యజమాని మధ్య హారన్ వివాదం.. నలుగురికి తీవ్ర గాయాలు..
ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును నేడు న్యాయస్థానం పరిగణలోకి తీసుకోనుంది. అనంతరం కవితకు, ఇతర నిందితులకు చార్జిషీట్ కాపీ అందించే అవకాశం ఉంది. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో మరో 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి కవితను కోర్టుకు నేరుగా తీసుకు రాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను హాజరుపరిచే అవకాశం ఉంది.
జగన్ అండ్‌కోకు మైండ్ బ్లాంక్!
Read more TS News and Telugu News