Home » Eknath Shinde
ఏకనాథ్ షిండే సారథ్యంలోని శివసేన ఇచ్చిన ఓ పత్రికా ప్రకటన తాజాగా మహారాష్ట్రలో రాజకీయ వివాదానికి దారితీసింది. ''దేశానికి మోదీ, మహారాష్ట్రకు షిండే'' అనే శీర్షికతో షిండే శివసేన పలు పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటన ఇచ్చింది. ఇందులో బీజేపీ మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రస్తావన కానీ, ఫోటో కానీ ఎక్కడా లేదు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో హింసాకాండ నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్సం చలన వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో బుధవారంనాడు ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తతలు చేటుచేసుకున్నాయి. సోషల్ మిడియాలో వచ్చిన వివాదాస్పద పోస్ట్ ఒకటి ఈ ఘర్షణలకు దారితీసింది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి జరిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఆర్ఏఎఫ్ బృందాలను రప్పించారు.
భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా శివసేన, బీజేపీ కలిసికట్టుగా పోటీ చేస్తాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. తాను, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం రాత్రి ఢిల్లీలో హోం మంత్రి అమిత్‌షాను కలిసినట్టు ఓ ట్వీట్లో షిండే తెలిపారు.
మహారాష్ట్ర, కర్ణాటక మధ్య జలాల పంపిణీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వరనా/కొయినా రిజర్వాయర్ నుంచి కృష్ణా నదికి 2.00 టీఎంసీల జలాలు, ఉజ్జయిని రిజర్వాయర్ నుచి భీమా నదికి 3.00 టీఎంసీల నీటిని వదలాల్సిందిగా సంబంధిత అధికారుల ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు బుధవారంనాడు ఒక లేఖ రాశారు.
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారంనాడు ఒక కొత్త ఆర్థిక పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని కోటి మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.6,000 చెల్లిస్తుంది. ఇంతే మొత్తంలో మరో రూ.6,000 కేంద్ర అందించాలని నిర్ణయించింది. దీంతో మహారాష్ట్ర రైతులు ఏటా రూ.12,000 పొందుతారు.
ముంబై: శివసేన రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చిన మరుసటి రోజే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే తమ ప్రత్యర్థి వర్గమైన ఏక్నాథ్ షిండేకు, బీజేపీకి సవాల్ విసిరారు. తాజా ఎన్నికలకు వెళ్దామని ఛాలెంజ్ చేశారు.
మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) రాజీనామా చేసి ఉండకపోతే, ఆయనను ఆ పదవిలో పునఃప్రతిష్ఠించి
సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట లభించింది. శివసేన వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఏక్ నాథ్ షిండే చీఫ్ విఫ్ నియామకం చెల్లదని, అది చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్టీలో విభేదాలను పార్టీలోనే పరిష్కరించుకోవాలి తప్ప గవర్నర్ జోక్యం తగదని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.
న్యూఢిల్లీ: శివసేనతో పొత్తు కొనసాగుతుందని, రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగానే తాము పోటీ చేస్తామని బీజేపీ స్పష్టత ఇచ్చింది. షిండే సీఎంగా కొనసాగుతారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.