Home » Eluru
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.. రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆదివారం ఏలూరులో నిర్వహించిన చర్చ కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొన్నారు.
సీఎం జగన్ (CM Jagan) నీ టైమ్ అయిపోయిందని.. ఈనెల 13న రెండు సింహాలు( చంద్రబాబు, పవన్ కళ్యాణ్) మధ్య నలిగిపోవడం ఖాయమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) హెచ్చరించారు. సింహాం సింగిల్‌గా వస్తుందని జగన్ మాటిమాటికీ అంటున్నారని.. కానీ ఆ రెండు సింహాల మధ్య నలిగి పోతాడని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Andhrapradesh: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలో రాజమండ్రి ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి, గోపాలపురం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. పంచాయతీ నిధులు దారి మళ్ళించారని ఆరోపించారు. ఈ వర్గానికి సంపూర్ణ న్యాయం చేయని పరిపాలన సాగించారన్నారు.
భీమవరం: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్రెడ్డి మంగళవారం భీమవరంలో ‘మేమంతా సిద్ధం’ సభ నిర్వహించనున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరు మండలం నారాయణపురం చేరుకున్న సీఎం సోమవారం రాత్రి బస ఇక్కడే చేశారు.
నాయి బ్రాహ్మణులపై ఏలూరు కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ వరాల జల్లు కురిపించారు. శుక్రవారం నగరంలో నాయి బ్రాహ్మణ సాధికార సమితి ఆధ్వర్యంలో మహసభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మహేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వైసీపీ(YCP)లో వర్గ విబేధాలు బయటపడుతున్నాయి. సొంత పార్టీలో నాయకులే కొట్టు కుంటున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో అసంతృప్త నేతలు తమ గళం విప్పుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వైసీపీలో లుకలుకలు బయటపడ్డాయి.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ప్రగడ నాగేశ్వరరావు (60) అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోశారు. యాసిడ్ దాడిలో నాగేశ్వరరావుకి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్త అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయం(Dwarka Tirumala China Venkanna temple) లో ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగులపై దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. ఓ ఉద్యోగిని సస్పెండ్ చేసి, సంబంధిత అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేసి, పలువురు సిబ్బందిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు.
Andhrapradesh: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. నేడు స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో స్వామిని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అయితే ఒక్కసారిగా దేవస్థానం టికెట్ల కౌంటర్ల సర్వర్లు పనిచేయలేదు. సాంకేతిక లోపం కారణంగా టికెట్ కౌంటర్ల సర్వర్లు పనిచేయని పరిస్థితి.
రాబోయే రోజుల్లో కాపు కులస్తులకు రాజ్యాధికారం వస్తుందని కాపు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పులి శ్రీరాములు (Puli Sreeramulu) అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏలూరులో కాపు సంక్షేమ సేవా సంఘం భవనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.కాపులకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో సంఘం ఏర్పాటు చేశామని అన్నారు.