AP Elections 2024:జగన్ నీ టైమ్ అయిపోయింది .. ఆ రెండు సింహాల మధ్య నలిగిపోతావ్.. నారా లోకేష్ మాస్ వార్నింగ్
ABN , Publish Date - May 05 , 2024 | 07:47 PM
సీఎం జగన్ (CM Jagan) నీ టైమ్ అయిపోయిందని.. ఈనెల 13న రెండు సింహాలు( చంద్రబాబు, పవన్ కళ్యాణ్) మధ్య నలిగిపోవడం ఖాయమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) హెచ్చరించారు. సింహాం సింగిల్‌గా వస్తుందని జగన్ మాటిమాటికీ అంటున్నారని.. కానీ ఆ రెండు సింహాల మధ్య నలిగి పోతాడని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఏలూరు: సీఎం జగన్ (CM Jagan) నీ టైమ్ అయిపోయిందని.. ఈనెల 13న రెండు సింహాలు( చంద్రబాబు, పవన్ కళ్యాణ్) మధ్య నలిగిపోవడం ఖాయమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) హెచ్చరించారు. సింహాం సింగిల్‌గా వస్తుందని జగన్ మాటిమాటికీ అంటున్నారని.. కానీ ఆ రెండు సింహాల మధ్య నలిగి పోతాడని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏలూరులో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన యువగళం సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చిన జగన్ రెండు డ్రామాలు ఆడతాడని... 2019లో కోడికత్తి డ్రామా, బాబాయ్(మాజీ మంత్రి వివేకా నందారెడ్డి) చంపిన డ్రామాలని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ఈ ఎన్నికల్లో గులకరాయి డ్రామా ఆడుతున్నారని ఏద్దేవా చేశారు. ఈ డ్రామా తర్వాత ఏ డ్రామా తీసుకువస్తాడోనని భయం వేస్తుందని దెప్పిపొడిచారు.
Sujana Choudary: వైసీపీ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు
సినిమాల్లోకి జగన్ వెళ్తే ఆస్కార్ అవార్డులు కాదు, భాస్కర్ అవార్డులు వస్తాయని సెటైర్లు గుప్పించారు. జగన్ తెచ్చింది.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు.. అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ఆరోపించారు. ఆ యాక్ట్‌పై గట్టిగా ప్రశ్నించినందుకు తమపై సీఐడీ కేసు పెట్టారని ధ్వజమెత్తారు. తన మీద ఇప్పటికే 23 కేసులు పెట్టారని.. ఇది 24 వ కేసు అవుతుందని చెప్పుకొచ్చారు. జగన్ తన మీద కేసులు పెట్టుకో.. నీ కేసులకు నేను భయపడేది లేదని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ హయాంలో అనేక పరిశ్రమలు తెచ్చామని గుర్తుచేశారు. జగన్ చేతకానితనం వల్ల అవన్నీ తెలంగాణకు తరలి వెళ్లిపోయాయని అన్నారు.25 మంది ఎంపీలను ఇస్తే, ప్రత్యేక హోదా తెస్తామని మాట మరిచారని ఫైర్ అయ్యారు.
PrajaGalam: ధర్మవరం వేదికగా పోలవరంపై అమిత్ షా కీలక ప్రకటన
ఈ ఎన్నికల్లో మీరు 31 మంది ఎంపీలను ఇచ్చినా ప్రత్యేక హోదా తీసుకురాడని.. దాని ఊసే మరిచిపోతాడని ఎద్దేవా చేశారు. మేలుకో ఆంధ్రుఢా.. మనకు పౌరుషం లేదా అని పిలుపునిచ్చారు. ఎంత కాలం ఉద్యోగాలకు ప్రక్క రాష్ట్రం వెళ్లాలని ప్రశ్నించారు. ఎంత కాలం రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండాలని నిలదీశారు. ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రం వారు మన రాష్ట్రానికి రావాలని ఉద్ఘాటించారు. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయని.. జాగ్రత్తలు తీసుకుని ఓటు వేయడానికి వెళ్లాలని నారా లోకేష్ సూచించారు.
AP Elections: ఎన్నికల ముందు మరో కుట్ర.. చంద్రబాబు, లోకేశ్‌పై కేసు!!
Read Latest Andhra pradesh News or Telugu News