Puli Sreeramulu: రాబోయే రోజుల్లో రాజ్యాధికారం దిశగా కాపులు
ABN , Publish Date - Mar 14 , 2024 | 03:50 PM
రాబోయే రోజుల్లో కాపు కులస్తులకు రాజ్యాధికారం వస్తుందని కాపు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పులి శ్రీరాములు (Puli Sreeramulu) అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏలూరులో కాపు సంక్షేమ సేవా సంఘం భవనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.కాపులకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో సంఘం ఏర్పాటు చేశామని అన్నారు.
ఏలూరు జిల్లా: రాబోయే రోజుల్లో కాపు కులస్తులకు రాజ్యాధికారం వస్తుందని కాపు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పులి శ్రీరాములు (Puli Sreeramulu) అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏలూరులో కాపు సంక్షేమ సేవా సంఘం భవనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.కాపులకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో సంఘం ఏర్పాటు చేశామని అన్నారు. జనసేన ( Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాటే తమకు శాసనమని ఆయన నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని తెలిపారు. రాష్ట్రంలో నాయకత్వ లోపం కనబడుతోందన్నారు. రాష్ట్రంలో కోటి యాభై లక్షల మంది కాపులు ఉన్నారని.. అందులో 80 శాతం కాపులు పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారని వివరించారు. కాపుల ఐక్యత, ఐకమత్యమే తమ ప్రధాన ఎజెండ అని చెప్పారు. 2024 ఎన్నికలకు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి తమ పూర్తి మద్దతు ఉంటుందని పులి శ్రీరాములు తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి