Home » Enforcement Directorate
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ , ఆమె ఐటీ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.
తృణమూల్ కాంగ్రెస్ నేత మహుతా మొయిత్రాను ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసు వెంటాడుతోంది. ఈ కేసులో ఆమెను, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానిని ప్రశ్నించేందుకు ఈనెల 28న తమ ముందు హాజరుకావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు సమన్లు జారీ చేసింది.
అనుమానాస్పద లావాదేవీలతో వేల కోట్ల రూపాయలు దేశం దాటించిన కేసులో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) అధికారులు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు
సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టు నుంచి జైలుకు తరలించారు. కవితకు కోర్టు 14 రోజులపాటు జుడీషియల్ రిమాండ్ విధించడంతో ఢిల్లీ పోలీసు అధికారులు జైలుకు తీసుకెళ్లారు. జైలు వ్యాన్‌లో ఆమె తరలించారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆమె తీహార్ జైల్లోనే ఉండనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఎమ్మెల్యే కవిత(MLC Kavitha) విషయంలో రౌస్ అవెన్యూ(Rouse Avenue Court) కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈడీ కస్టడీ(ED Custody) ముగిసిన నేపథ్యంలో ఆమెకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది ధర్మాసనం.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ( Kejriwal ) సీఎం పదవికి రాజీనామా చేయలేదు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ ఈడీ కస్టడి నుంచి తొలి ఆర్డర్స్ సైతం జారీ చేసేశారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈడీ(ED) అధికారులు.. కవితను రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) హాజరుపరుచనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన్ని మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి తీసుకోవడంతో అధికారులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని అధికారులు అంటున్నారు. ఆయన్ని విచారిస్తున్న క్రమంలో ఊహించని ఓ ట్విస్ట్ ఈడీ అధికారులకు ఎదురైంది.
Kavitha Arrest: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ ఇప్పట్లో వదిలేలా లేదు.!. లెక్కలు తేల్చాల్సిందేనని గట్టిగానే ఉన్నారు అధికారులు. ఇప్పటికే ఈడీ సమన్లు ఇవ్వడం, విచారణ, అరెస్ట్.. కస్టడీ.. మళ్లీ సోదాలు ఇలా వరుస షాకులిచ్చిన అధికారులు త్వరలో మరో కీలక పరిణామంతో తెలంగాణలోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది..
మద్యం కుంభకోణంలో కేసులో అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) నిర్బంధం నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వానికి సంబంధించి తన మొదటి ఉత్తర్వును జలవనరుల శాఖకు జారీ చేశారు. ఇవాళ సమావేశం నిర్వహించనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అతిషి సీఎం ఆదేశాల గురించి సమాచారం ఇవ్వనున్నారు.