MLC Kavitha: ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించిన అధికారులు
ABN , Publish Date - Mar 26 , 2024 | 05:39 PM
సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టు నుంచి జైలుకు తరలించారు. కవితకు కోర్టు 14 రోజులపాటు జుడీషియల్ రిమాండ్ విధించడంతో ఢిల్లీ పోలీసు అధికారులు జైలుకు తీసుకెళ్లారు. జైలు వ్యాన్‌లో ఆమె తరలించారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆమె తీహార్ జైల్లోనే ఉండనున్నారు.
ఢిల్లీ: సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) నుంచి జైలుకు తరలించారు. కవితకు కోర్టు 14 రోజులపాటు జుడీషియల్ రిమాండ్ విధించడంతో ఢిల్లీ పోలీసు అధికారులు జైలుకు తీసుకెళ్లారు. జైలు వ్యాన్‌లో ఆమె తరలించారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆమె తీహార్ జైల్లోనే (Tihar Jail) ఉండనున్నారు.
మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఎమ్మెల్యే కవితకు ఈడీ కస్టడీ(ED Custody) ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది. ఏప్రిల్ 9 వరకు కవిత జుడీషియల్ కస్టడీలోనే ఉండనున్నారు. ఏప్రిల్ 9 న ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే కవితను కస్టడీకి ఇవ్వడం ఇది మూడోసారి. మొదట 7 రోజులు, ఆ తరువాత 3 రోజులు, ఇప్పుడు 14 రోజులు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. కాగా కవితను తీహార్ జైలు నుంచే విచారణ జరిపే అవకాశాలున్నాయి.
మరోవైపు ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని కోర్టుకు ఈడీ తెలిపింది. దీంతో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1వ తేదీన విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది.
TS News: విద్యార్థులకు గంజాయి విక్రయం.. ముఠా గుట్టు రట్టు
CM Revanth Reddy: మూడోసారి మోదీకి ఎందుకు ఓటు వేయాలి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి