Home » Enforcement Directorate
దిల్లీ మద్యం కేసులో ఇటీవల అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ పై బీజేపీ మండిపడింది. ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ( Kejriwal ) పడుతున్న బాధకు కేజ్రీవాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case) మనీలాండరింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఈడీ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె ఏడో రోజు కస్టడీలో ఉన్నారు. నేటితోనే (23/03/24) కస్టడీ పూర్తవ్వాల్సింది కానీ.. కవితను విచారించేందుకు మరో ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని ఈడీ కోరింది. అయితే.. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ ఖండిస్తూ.. మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) తిప్పికొట్టారు. కేజ్రీవాల్ జైలులో ఉన్న ఏ ఏజెన్సీ వల్లనో కాదని, తన సొంత చర్యల వల్లేనని పేర్కొన్నారు. దర్యాప్తులో కేంద్ర సంస్థలకు కేజ్రీవాల్ ఏమాత్రం సహకరించలేదని చెప్పారు. ‘మేము తినము, ఇతరుల్ని తిననివ్వము’ అనే విధానాన్ని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోందని అన్నారు.
మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో పైర్ అయ్యారు. కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు స్వాగతిస్తున్నానన్నారు. తాను అప్రూవర్ గా మారి సీఎంకు శిక్ష పడేలా చేస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Meka Sravan ED: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ మరో మూడ్రోజులకు పొడిగించిన సంగతి తెలిసిందే. అటు సోదాలు.. ఇటు రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో కవిత రిమాండ్ రిపోర్టును ఈడీ విడుదల చేసింది. ఈ రిపోర్టులో ఈడీ కీలక విషయాలను ప్రస్తావించింది. తాజా ఈడీ అఫిడవిట్‌తో కొత్త పేరు తెరపైకి వచ్చింది..
లిక్కర్ పాలసీ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) అరెస్టుపై జర్మనీ చేసిన కామెంట్లను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని పేర్కొంది.
Kavitha ED Custody: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కాసింత రిలీఫ్ దక్కింది. ఓ వైపు వరుస ఈడీ సోదాలు.. మరోవైపు కస్టడీలో విచారణతో సతమతం అవుతున్న కవిత..
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటి ముగిసింది. దీంతో కాసేపటి క్రితమే కవితను ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హాజరుపర్చారు. ఈడీ తరపున న్యాయవాది జోయాబ్ హుసేన్ వాదనలు వినిపించారు. కవితను విచారించేందుకు మరో అయిదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు.
Kavitha ED Custody: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) ఈడీ కస్టడీ (ED Custody) మరో మూడ్రోజులు పొడిగించడం జరిగింది. అరెస్ట్ తర్వాత ఏడు రోజులపాటు ఈడీ కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే..
ED Raids On Kavitha Family Members: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసును కొలిక్కి తీసుకురావడానికి ఈడీ (ED) అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Kejriwal) అరెస్టులు జరిగాయని హస్తిన వర్గాలు చెబుతున్న మాట..