Arvind Kejriwal: ఆ చర్యల వల్లే.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 23 , 2024 | 08:31 PM
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ ఖండిస్తూ.. మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) తిప్పికొట్టారు. కేజ్రీవాల్ జైలులో ఉన్న ఏ ఏజెన్సీ వల్లనో కాదని, తన సొంత చర్యల వల్లేనని పేర్కొన్నారు. దర్యాప్తులో కేంద్ర సంస్థలకు కేజ్రీవాల్ ఏమాత్రం సహకరించలేదని చెప్పారు. ‘మేము తినము, ఇతరుల్ని తిననివ్వము’ అనే విధానాన్ని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోందని అన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ ఖండిస్తూ.. మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) తిప్పికొట్టారు. కేజ్రీవాల్ జైలులో ఉన్న ఏ ఏజెన్సీ వల్లనో కాదని, తన సొంత చర్యల వల్లేనని పేర్కొన్నారు. దర్యాప్తులో కేంద్ర సంస్థలకు కేజ్రీవాల్ ఏమాత్రం సహకరించలేదని చెప్పారు. ‘మేము తినము, ఇతరుల్ని తిననివ్వము’ అనే విధానాన్ని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోందని అన్నారు. మీరు అవినీతికి పాల్పడుతుంటే.. ప్రభుత్వం మౌనంగా చోద్యం చూస్తూ కూర్చోవాలంటే కుదరదని ఉద్ఘాటించారు. ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు.
అవినీతిని దాచిపెట్టలేనంత అద్భుతంగా నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం పరిపాలనను కొనసాగిస్తోందని హిమంత పేర్కొన్నారు. కేజ్రీవాల్ లేదా ప్రతిపక్ష పార్టీల సమస్య ఏమిటంటే.. తాము అవినీతికి పాల్పడినా, ప్రభుత్వం తమపై మూగ ప్రేక్షకుడిలాగా వ్యవహరించాలని ఆశిస్తున్నాయని దుయ్యబట్టారు. కానీ, ఇది ఎప్పటికీ జరగదని తేల్చి చెప్పారు. ఈడీ (Enforcement Directorate) తొమ్మిదిసార్లు సమన్లు పంపిస్తే కేజ్రీవాల్ పట్టించుకోలేదని.. ఆయన విచారణకు సహకరించలేదని గుర్తు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలేమిటో తెలుసుకోవాలని కేజ్రీవాల్ భావిస్తే.. కేంద్ర ఏజెన్సీకి వెళ్లి విచారణకు సహకరించేవారని, కానీ ఆయనలా చేయలేదని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని (Aam Admi Party) ఇతర నేతలతో కలిసి కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారని, ఆ తర్వాత దానిని రాజకీయ అంశంగా మార్చేందుకు ప్రయత్నించారని, కానీ ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు.
మరి.. బీజేపీ నేతలకు కేంద్ర ఏజెన్సీల నుంచి ఎందుకు నోటీసులు రావడం లేదు? అనే ప్రశ్న హిమంతకు ఎదురైంది. ఇందుకు ఆయన బదులిస్తూ.. కేంద్ర ప్రభుత్వాన్ని, అందులో ప్రమేయం ఉన్న వ్యక్తులను ఎవరూ అవినీతి చేయలేని విధంగా మోదీ గట్టిగా ఉంచారన్నారు. ఒకవేళ మోదీ ప్రభుత్వం లేకపోయి ఉంటే, బీజేపీలో (BJP) చేరిన వారికి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉండేదేమోనని అభిప్రాయపడ్డారు. అయితే.. మోదీ ప్రభుత్వంలో ఎంతో నిజాయితీ ఉందని, అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రజల కోసం పని చేస్తున్నారని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి