Kejriwal : కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు పంపండి.. శిక్ష పడేలా చేస్తా.. సుకేశ్ సంచలన ప్రకటన..
ABN , Publish Date - Mar 23 , 2024 | 05:13 PM
మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో పైర్ అయ్యారు. కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు స్వాగతిస్తున్నానన్నారు. తాను అప్రూవర్ గా మారి సీఎంకు శిక్ష పడేలా చేస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో పైర్ అయ్యారు. కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు స్వాగతిస్తున్నానన్నారు. తాను అప్రూవర్ గా మారి సీఎంకు శిక్ష పడేలా చేస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ ( ED ) అరెస్టు చేసిన అనంతరం మార్చి 22 న ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచగా మార్చి 28 వరకు ఆరు రోజుల కస్టడీకి తరలించారు. ఈ క్రమంలో సుకేశ్ చంద్రశేఖర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. "నిజం గెలిచింది. నేను ఆయనను తీహార్ జైలుకు స్వాగతిస్తున్నాను. కేజ్రీవాల్ కు, ఆయన టీమ్ కు వ్యతిరేకంగా సాక్షిగా మారుతాయి. కేజ్రీవాల్ కు శిక్ష పడేలా చూస్తాను" అని తీవ్ర కామెంట్లు చేశారు. కేజ్రీవాల్ అవినీతికి రాజుగా మారారని సుకేశ్ ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు.
Punjab : నాడు డ్రగ్స్ మత్తు.. నేడు నకిలీ మందు చిచ్చు.. ఎన్నికల వేళ 20కి చేరిన మరణాలు..
ఇదే కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై స్పందిస్తూ గతంలో సంచలన కామెంట్లు చేశారు సుకేశ్ చంద్రశేఖర్. దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు రక్షణ కల్పించవద్దని కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలకు కవిత ₹ 100 కోట్లు చెల్లించారని ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలో లేఖ రాసిన సుకేశ్.. "సత్యం గెలిచింది - రాజకీయ మంత్రగత్తె వేటకు తెరపడింది, మీ కర్మలన్నీ మీకు తిరిగి వస్తున్నాయి. చట్టం గతంలో కంటే ఇప్పుడు కఠినంగా మారింది". అని చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టించాయి.
Trending Video: రొమాంటిక్ సాంగ్.. రంగులతో హల్చల్.. దిల్లీ మెట్రోలో యువతుల రచ్చ..
మోసం చేసి దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలతో సుకేశ్ చంద్రశేఖర్ ను ఈడీ అరెస్టు చేసింది. రోహిణి జైలులో ఉన్న తన భర్తకు బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి, ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ చంద్రశేఖర్ తో పాటు అతని అనుచరులు తన నుంచి డబ్బు తీసుకున్నారని బాధితురాలు అదితి సింగ్ ఆరోపించారు. ఈ కేసులో చంద్రశేఖర్ తో పాటు అతని భార్య లీనా మారియా పాల్‌ను దిల్లీ పోలీసులు సెప్టెంబర్ 2023లో అరెస్టు చేశారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.