Home » Enforcement Directorate
మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. జూన్ 1వ తేదీ వరకూ ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు అధికారులు ఆయనను సాయంత్రం విడుదల చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Scam Liquor Case) మార్చి 15న కవితను అరెస్టు చేసి... మరుసటి రోజు రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు ముందు ఈడీ హాజరుపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు(శుక్రవారం) ఈ కేసులో ఎన్ఫోర్సమెంట్ డైరక్టరేట్ - ఈడీ ఏడో ఛార్జిషీట్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మరో నలుగురు నిందితుల పాత్రపై దర్యాప్తు సంస్థ ఛార్జీషీట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
జార్ఖండ్‌లోని ఓ హౌస్ కీపర్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన సోదాల్లో.. లెక్కల్లో చూపని రూ.25 కోట్ల నోట్ల కట్టలు బయటపడిన ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తనతో పాటు తన ప్రభుత్వం..
ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారంనాడు విచారణ జరిగింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సమయంపై స్పందించాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. బెయిల్‌పై మే 6న తీర్పు ఇవ్వనుంది. కవిత బెయిల్ పిటిషన్‌పై బుధవారం కోర్టులో విచారణకు రాగా.. ఈడీ వాదనలు వినిపించింది. సెక్షన్ 19 కింద కవితను చట్టబద్దంగా అరెస్టు చేశామని.. అక్రమంగా అరెస్టు చేశారనే దానిలో పసలేదని ఈడీ పేర్కొంది. అలాగే కేసుకు సంబంధించి మరికొన్ని వివరాలను ఈడీ తరపున న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. దాదాపు రెండు గంటల పాటు ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అనంతరం తీర్పును స్పెషల్ కోర్టు రిజర్వ్ చేసింది.
Telangana: ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మొదలైంది. బుధవారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ మొదలవగా.. ఈడీ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ కవిత పిటిషన్ దాఖలు చేయగా.. గత రెండు రోజులుగా కోర్టులో విచారణ జరుగుతోంది. నిన్నటి (మంగళవారం) విచారణలో కవిత తరపున న్యాయవాది నితేష్ రానా... ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వినిపించారు.
Telangana: ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగగా.. కవిత తరపున న్యాయవాది నితేష్ రానా వాదనలు వినిపించగా... ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వినిపించారు. ఈడీ వాదనల అనంతరం ఈ కేసుపై విచారణను కోర్టు రేపటికి (బుధవారం) వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. రేపు మధ్యాహ్నం ఇరువురి వాదనలు రౌస్ అవెన్యూ కోర్టు విననుంది.
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీబీఐ అరెస్ట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగియగా.. తీర్పున రిజర్వ్ చేసింది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు. ఆ వెంటనే ఈడీ కేసులో బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు మొదలవగా.. విచారణను కోర్టు రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. కవిత తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ చేసిన ఆరోపణలను ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తోసిపుచ్చారు.
బిట్ కాయిన్ కుంభకోణంతో ప్రమేయమున్న వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఆస్తులను ఈడీ గురువారం సీజ్ చేసింది. దాదాపు రూ. 100 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. ముంబై జూహులోని ఫ్లాట్‌తోపాటు పుణేలోని బంగ్లాను సైతం సీజ్ చేసిన వాటిలో ఉన్నాయి.