Share News

Kejriwal: కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల...తొలి రియాక్షన్ ఇదే

ABN , Publish Date - May 10 , 2024 | 08:26 PM

మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. జూన్ 1వ తేదీ వరకూ ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు అధికారులు ఆయనను సాయంత్రం విడుదల చేశారు.

Kejriwal: కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల...తొలి రియాక్షన్ ఇదే

న్యూఢిల్లీ: మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీహార్ (Tihar) జైలు నుంచి శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. జూన్ 1వ తేదీ వరకూ ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు అధికారులు ఆయనను సాయంత్రం విడుదల చేశారు. జైలు వెలుపల పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్, పంజాబ్ మఖ్యమంత్రి భగవంత్ మాన్ తదితరులు జైలు బయట ఆయనకు స్వాగతం పలికారు. ఆలివ్ టీషర్డ్‌లో ఉన్న కేజ్రీవాల్ కారులో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

Kejriwal Bail: కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ షరతులివే..


హనుమాన్ ఆశీర్వాదం వల్లే...

హనుమాన్ ఆశీర్వాదం వల్లే మళ్లీ ప్రజల ముందుకు వచ్చానని, తనను ఆశీర్వదించిన కోట్లాది మంది ప్రజలకు కృతజ్ఞతలని ఈ సందర్భంగా కేజ్రీవాల్ అన్నారు. శనివారం సాయంత్రం కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ మందిరాన్ని దర్శిస్తానని, మధ్యాహ్నం ఒంటి గంటకు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వహిస్తామని తెలిపారు. తీహార్ జైలు గేట్ నెంబర్ 3 నుంచి కేజ్రీవాల్‌ను విడుదల చేసేందుకు తొలుత ఏర్పాట్లు చేశారు. అయితే ఆ తర్వాత గేట్ నెంబర్ 4 నుంచి విడుదల చేయడంతో ఆయన గేట్ నెంబర్ 3 వరకూ వచ్చి తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు.

For More National News and Telugu News..

Updated Date - May 10 , 2024 | 11:07 PM