Home » Etela rajender
చెరువు, బఫర్ జోన్లలో నిర్మించిన పెద్దల అక్రమ నిర్మాణాలను హైడ్రాతో కూల్చివేయించడం సంతోషమే కానీ.. అదే ముసుగులో సామాన్యుల నిర్మాణాలను పడగొడతామంటే ఊరుకోబోమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రక్షాబంధన్‌తో సురక్షిత భారత్ సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
డాక్టర్లపై దాడులు జరగకుండా పటిష్ఠమైన చట్టాలు తీసుకురావాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. కోల్‌కతాలో జూనియర్ మహిళా డాక్టర్‌పై హత్యాచార ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ)తెలంగాణా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన, ర్యాలీలు నిర్వహించారు.
రుణమాఫీ పథకాన్ని అమలు చేశామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకోవడంలో అర్ధం లేదని, అంతా బోగస్ అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
తెలంగాణలో రూ.32 వేలకోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్లమెంటు వేదికగా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రైతు రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. 2004 నుంచి 2014 వరకు రైతు సమస్యలను కాంగ్రెస్ గాలికొదిలేసిందని విమర్శించారు.
నీతి ఆయోగ్ సమావేశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి బహిష్కరించడం సరికాదని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
Telangana: రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఒట్టులు వేసి.. దేవుళ్ళను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శలు గుప్పించారు. రుణమాఫీలో నిబంధనలు పేరిట రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్ను కొట్టిందన్నారు. పరిజ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిందన్నారు.
కూకట్పల్లి జేఎన్టీయూలో పలు భవనాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదంటూ మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమంలో స్థానిక ఎంపీ అయిన తనకు ఆహ్వానం పంపకుండా అధికారులు ప్రోటోకాల్ విస్మరించారని మండిపడ్డారు.
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రాంత ప్రజలను రైల్వేచక్రబంధం నుంచి విముక్తి కలిగించడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) అన్నారు. ఆయన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించారు.