Home » Etela rajender
రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే వాటి ఊసే ఎత్తడం లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajigiri MP Etala Rajender) ఆరోపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి డబ్బులు దండుకోవటం తప్ప పాలనపై ధ్యాస లేదని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ (MP Etela Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. పీర్జాదిగూడ(Peerzadiguda ) పరిధిలోని ప్రియ ఎన్ క్లేవ్లో పేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిందంటూ ఈటెల తీవ్రంగా స్పందించారు.
‘‘బీజేపీకి తెలంగాణలో 8 మంది ఎంపీలు.. 8 మంది ఎమ్మెల్యేలున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో 88 స్థానాల్లో విజయం సాధించి, రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం’’ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఉద్ఘాటించారు.
‘నేను శామీర్‌పేటలోనే ఉంటున్నా.. మీకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటా’ అని ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) పేర్కొన్నారు. ఈ మేర కు బుధవారం కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్‌లోని మేడక కోటేశ్వరరావు, వాణిశ్రీ ఇంట్లో తేనేటీ విందుకు హాజరయ్యారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనేది పూర్తిగా అధిష్ఠానం పరిధిలోని విషయమని కిషన్ రెడ్డి తెలిపారు
సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటుపరం చేస్తుందని ఎన్నికల్లో ఓట్ల కోసం బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ అసత్య ప్రచారం చేశారని, అదంతా ఆయన ఆడిన డ్రామా అని మండిపడ్డారు.
మల్కాజిగిరి ఎంపీ నియోజకవర్గ ప్రజలకు సేవచేయడానికి ఎల్లప్పుడు ముందుంటానని ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) అన్నారు. బీజేపీ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు నూతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్‌కు అభినందన కార్యక్రమాన్ని ఎఫ్‌సీఐ కాలనీలో నిర్వహించారు.
కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు రెండు కీలక పదవులు దక్కాయి. కేంద్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే బొగ్గు, గనుల శాఖను కిషన్‌రెడ్డికి కేటాయిస్తూ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతలను పరిరక్షించే హోంశాఖకు సహాయ మంత్రిగా బండి సంజయ్‌ని నియమించారు.
రాష్ట్ర బీజేపీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. రాష్ట్ర శాఖకు కొత్త సారథి నియామకం జరగబోతోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్‌కు రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో టీడీపీ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు ఉండవచ్చని తెలుస్తోంది. మంత్రి పదవులు వరించే అవకాశం ఉన్న వారిలో తెలుగుదేశం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.