Home » Flood Victims
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారటంతో రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాధారణ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
వర్షాకాలం వచ్చిందంటే కొంత మంది బాధలు వర్ణనాతీతం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. భారీ వర్షం కురిస్తే చాలు నీరు అంతా ఇంట్లోకి వచ్చేస్తోంది. ఇక, ఆ వరద తగ్గే వరకు ఆ నీటిలోనే మనుగడ సాగించాల్సి ఉంటుంది.
మహారాష్ట్రలోని రత్నగిరిలో దారుణం జరిగింది. నదిలోకి ఈత కొట్టేందుకు దిగిన వ్యక్తి కళ్ల ముందే కొట్టుకుపోయాడు. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా రత్నగిరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
భారీ వర్షాలకు ఖమ్మం, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాగుల్లోకి వరద నీరు పోటెత్తడంతో వరి చేలు నీట మునిగాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురవగా,
మహారాష్ట్రని భారీ వర్షాలు(Heavy Rains) వణికిస్తున్నాయి. ఇప్పటికే ముంబయి మహా నగర ప్రజలు వరదలతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటుండగా.. విద్యా సంస్థలకు అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. సమస్యా్త్మక ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు మోహరించాయి.
ఆపదల్లో ప్రాణం కాపాడిన వారిని దేవుడిలా వచ్చి కాపాడావంటూ కృతజ్ఞతలు చెప్పుకోవడం సహజం. ప్రకృతి ప్రకోపంతో వరద నీటిలో చిక్కుకున్న ఓ మణిపూర్ యువకుడు తనను లైఫ్ బోట్‌తో కాపాడిన అసోం రైఫిల్స్ సిబ్బందికి వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలియజేయాడు. సంప్రదాయ గీతాన్ని వారికి వినిపించి ఉత్సాహపరిచాడు.
అసోంలో వరదల(Assam floods) పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత కొన్ని రోజులుగా భారీ వరదలతో అల్లాడుతున్న అసోం ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో నివసిస్తున్నారు. ఈ వరదల్లో ఇప్పటివరకు 38 మంది మృత్యువాత చెందగా, గత 24 గంటల్లో వరద నీటిలో మునిగి ముగ్గురు వ్యక్తులు మరణించారు.
పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల(Heavy Rains) కారణంగా అసోంలో వరదలు పోటెత్తుతున్నాయని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sarma) సోమవారం తెలిపారు. బ్రహ్మపుత్ర దాని ఉపనదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తుండటం వల్ల అమెరికాలో వరదలు తీవ్రరూపం దాల్చాయి. ఈ దెబ్బకు ఐయోవా, సౌత్ డకోటా, మిన్నెసోటా, నెబ్రోస్కా రాష్ట్రాలు వరద బీభత్సంతో...
అసోం వరదల్లో మృతుల సంఖ్య 37కు చేరింది. మరొకరు గల్లంతయ్యారు. సుమారు 4 లక్షల మంది వరద ప్రభావానికి గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.