Share News

Manipur Floods: వరదల్లో కాపాడినందుకు.. ఆ యువకుడు ఎలా కృతజ్ఞత చెప్పాడో చూస్తే గుండె బరువెక్కుతుంది..!

ABN , Publish Date - Jul 06 , 2024 | 09:15 PM

ఆపదల్లో ప్రాణం కాపాడిన వారిని దేవుడిలా వచ్చి కాపాడావంటూ కృతజ్ఞతలు చెప్పుకోవడం సహజం. ప్రకృతి ప్రకోపంతో వరద నీటిలో చిక్కుకున్న ఓ మణిపూర్ యువకుడు తనను లైఫ్ బోట్‌తో కాపాడిన అసోం రైఫిల్స్ సిబ్బందికి వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలియజేయాడు. సంప్రదాయ గీతాన్ని వారికి వినిపించి ఉత్సాహపరిచాడు.

Manipur Floods: వరదల్లో కాపాడినందుకు.. ఆ యువకుడు ఎలా కృతజ్ఞత చెప్పాడో చూస్తే గుండె బరువెక్కుతుంది..!

ఇంఫాల్: ఆపదల్లో ప్రాణం కాపాడిన వారిని దేవుడిలా వచ్చి కాపాడావంటూ కృతజ్ఞతలు చెప్పుకోవడం సహజం. ప్రకృతి ప్రకోపంతో వరద నీటిలో (Floods) చిక్కుకున్న ఓ మణిపూర్ (Manipur) యువకుడు తనను లైఫ్ బోట్‌తో కాపాడిన అసోం రైఫిల్స్ (Assam Rifles) సిబ్బందికి వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలియజేయాడు. సంప్రదాయ గీతాన్ని (Traditional song) వారికి వినిపించి ఉత్సాహపరిచాడు. వరద నీటిలో అసోం రైఫిల్స్ సిబ్బంది లైఫ్ బోటును నడుపుతుండగా, అదే బోటులో ఆ యువకుడు పాడుతూ కనిపిస్తున్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రాణాలకు లెక్కచేయకుండా జవాన్లు అందిస్తున్న సహాయక చర్యలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Rahul Gandhi: మణిపూర్‌లో పర్యటించనున్న రాహుల్.. ఎప్పుడంటే..?


అసోంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలు ముంపులో చిక్కుకున్నాయి. ఇంతవరకూ 2,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెండు జిల్లాల్లోనూ మొత్తం 20 సహాయక శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ అక్కడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇది ప్రకృతి వైపరీత్యమని, ఇంతటి భారీ వర్షాలు ఊహించలేదని, దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. మణిపూర్ వరదల్లో సేనాపతి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వరదలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు, శాశ్వత పరిష్కారం కోసం ఒక సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తామని భరోసా ఇచ్చారు.

For Latest News and National News click here

Updated Date - Jul 06 , 2024 | 09:15 PM