Home » Gajendra Singh Shekhawat
కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్ర షెకావత్ స్కై డైవింగ్ చేశారు. ‘ప్రపంచ స్కై డైవింగ్ డే’ సందర్భంగా శనివారం ఆయన ఈ అరుదైన సాహసం చేశారు.
మంగళవారం నాడు పలువురు కేంద్ర మంత్రులు తమకు కేటాయించిన మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు తరువాత సోమవారం సాయంత్రం పలువురు కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు ప్రధాని నరేంద్ర మోదీ.
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీట్లు పంపకం జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సీట్ల సంఖ్య.. హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని మూడు పార్టీలు ధృడ సంకల్పంతో ముందడుగు వేశాయని ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ఉండవల్లిలోని చంద్రబాబు (Chandrababu) నివాసంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి కీలక సమావేశం కొనసాగుతోంది. పొత్తు కుదిరిన నేపథ్యంలో టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) పార్టీలు కీలక చర్చలు జరుపుతున్నాయి. ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై పార్టీలు ప్రధానంగా దృష్టిసారించాయి. టీడీపీ బాస్ నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), బీజేపీ తరపున గజేంద్ర సింగ్ షకావత్ (Gajendra Singh Shekhawat), జయంత్ పాండే (Jayanth Pandey) ఈ భేటీలో పాల్గొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు. బీజేపీతో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై చంద్రబాబుతో చర్చించనున్నారు. కాగా.. కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ బృందం కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లింది. నేటి భేటీతో బీజేపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి నివాసానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ బృందం చేరుకుంది. వీరితో జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. గత రెండు రోజులుగా ఏపీలోని తమ పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కూడా భేటీ అయ్యారు.
దేశంలోని 75 శాతం గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు అందించామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekhawat) గురువారం వెల్లడించారు. దీనిని "భారీ మైలురాయి"గా పేర్కొన్న షెకావత్, లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్న అన్ని రాష్ట్రాలను అభినందించారు.
పొలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని జగన్ ప్రభుత్వం పెంచిందని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షేకావత్ ( Gajendra Shekawat ) అన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల సంఘం ప్రకటించినప్పటి నుంచి.. ఏయే రాష్ట్రాల్లో ఎవరెవరు గెలుస్తారు? ఏయే పార్టీలు ఎక్కడెక్కడ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తాయి? అనే లెక్కలు వేసుకోవడంతో పాటు...
పోలవరంపై కేంద్రం మరో బాంబు పేల్చింది. నిర్వాసిత కుటుంబాలకు పరిహారాన్ని నేరుగా నగదు బదిలీ చేయడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది. పోలవరం నిర్మాణ బాధ్యతలు రాష్ట్రమే చేపడుతున్నందు వల్ల కేంద్రం నగదు బదిలీ చేయడం కుదరదని స్పష్టం చేసింది.