Gajendra Singh: సేవాలాల్ మహారాజ్ జయంతిని జాతీయ పండుగగా నిర్వహించాలి
ABN , Publish Date - Dec 06 , 2024 | 05:12 AM
కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో బీజేపీ తెలంగాణ ఎంపీలు భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో బీజేపీ తెలంగాణ ఎంపీలు భేటీ అయ్యారు. బంజారా జాతి ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15వ తేదీని జాతీయ పండుగగా నిర్వహించాలని ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్‌రావు విజ్ఞప్తి చేశారు. వీరితో పాటు మహబూబాబాద్ మాజీ ఎంపీ ప్రొ.సీతారాం నాయక్ కూడా కేంద్ర మంత్రిని కలిశారు.