Share News

Union Ministers: బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రులు..

ABN , Publish Date - Jun 11 , 2024 | 02:31 PM

మంగళవారం నాడు పలువురు కేంద్ర మంత్రులు తమకు కేటాయించిన మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు తరువాత సోమవారం సాయంత్రం పలువురు కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు ప్రధాని నరేంద్ర మోదీ.

Union Ministers: బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రులు..
Union Ministers

న్యూఢిల్లీ, జూన్ 11: మంగళవారం నాడు పలువురు కేంద్ర మంత్రులు తమకు కేటాయించిన మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు తరువాత సోమవారం సాయంత్రం పలువురు కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాదు.. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తరువాత వారంలో కనీసం నాలుగు రోజులు ఢిల్లీలో మంత్రిత్వ శాఖ పనుల్లో ఉండాలని ప్రధాని సూచించారు. ఆయా మంత్రిత్వ శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని, పూర్తి పట్టు సాధించాలని మంత్రులకు చెప్పారు ప్రధాని. తొలి వంద రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారు.


ప్రధాని సూచనలకు అనుగుణంగా కేంద్ర మంత్రులు బాధ్యతల చేపడుతున్నారు. ఈ రోజు బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రుల వివరాలు ఓసారి చూద్దాం..

👉 కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా

👉 పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా గజేంద్ర సింగ్‌ షెకావత్‌

👉 వ్యవసాయ శాఖ మంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

👉 ఆరోగ్య శాఖ మంత్రిగా జెపి నడ్డా

👉 కమ్యూనికేషన్‌ శాఖ మంత్రిగా జ్యోతిరాధిత్య సింధియా

👉 విద్యుత్‌ శాఖ మంత్రిగా మనోహర్‌ లాల్‌

👉 ఓడరేవులు, ఓడల శాఖ మంత్రిగా సర్బానంద సోనోవాల్‌

👉 కార్మిక శాఖ మంత్రిగా మన్‌సుఖ్‌ మాండవియా

👉 పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కిరణ్‌ రిజిజు

👉 రైల్వే శాఖ మంత్రిగా అశ్వనీ వైష్ణవ్‌

👉 ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రిగా జితిన్‌ రాం మాంఝీ

👉 శాస్త్ర సాంకేతిక, పిఎంఓ శాఖల సహాయ మంత్రిగా డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

👉 ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రిగా అనుప్రియ పటేల్‌

👉 న్యాయశాఖ మంత్రిగా అర్జున్‌రాం మేఘవాల్‌

👉 సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రిగా ఎల్‌ మురుగన్‌

👉 పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రిగా ఎం.ఎల్‌.ఖట్టర్‌

👉 విద్యా, నైపుణ్యాభివృద్ది శాఖల సహాయ మంత్రిగా జయంత్‌ చౌదరి బాధ్యతలు చేపట్టారు.


బుధవారం నాడు రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు.

For More National News and Telugu News..

Updated Date - Jun 11 , 2024 | 03:11 PM