Home » Glass Symbol
గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా జనసేన పార్టీకి రిజర్వ్ చేయాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. గుర్తుల కేటాయింపు ప్రక్రియ ఏ దశలో ఉందో కనుక్కొని సాయంత్రం నాలుగు గంటలకు కోర్టుకు చెప్పాలని ఎలక్షన్ కమిషన్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జనసేన పార్టీ గుర్తు కేటాయింపుపై గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆ పార్టీకి పూర్తి రిలీఫ్ అయితే రాలేదు కానీ కొంత మేర రిలీఫ్ లభించింది. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులు ఎవరికి కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. జనసేన గుర్తుపై ఈమేరకు ఈసీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల (AP Elections 2024) ముందు చిత్ర విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ (TDP, Janasena, BJP) పార్టీల్లో టికెట్లు దక్కని ఆశావహులు పలుచోట్ల రెబల్స్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆ నేతలతో కూటమికి పెద్ద తలనొప్పే వచ్చిపడింది. అదెలాగంటే..