Janasena: గాజు గ్లాసు గుర్తుపై జనసేనకు కొంత రిలీఫ్..
ABN , Publish Date - May 01 , 2024 | 12:28 PM
జనసేన పార్టీ గుర్తు కేటాయింపుపై గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆ పార్టీకి పూర్తి రిలీఫ్ అయితే రాలేదు కానీ కొంత మేర రిలీఫ్ లభించింది. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులు ఎవరికి కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. జనసేన గుర్తుపై ఈమేరకు ఈసీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
అమరావతి: జనసేన పార్టీ గుర్తు కేటాయింపుపై గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆ పార్టీకి పూర్తి రిలీఫ్ అయితే రాలేదు కానీ కొంత మేర రిలీఫ్ లభించింది. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులు ఎవరికి కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. జనసేన గుర్తుపై ఈమేరకు ఈసీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటికే ఇచ్చిన ప్రాంతాల్లో రివ్యూ చేస్తామని ఈసీ అఫిడవిట్‌లో పేర్కొంది. మొత్తానికి జనసేనకు కాస్త రిలీఫే కానీ మొత్తానికి అయితే కాదు. ఇది పోటీ చేయని ప్రాంతాల్లో గ్లాస్ గుర్తు కేటాయించడమంటే కూటమికి నష్టం చేకూర్చడమే కదా? మరి దీనిపై ఈసీ ఏం చేస్తుందో చూడాలి.
Loksabha Polls 2024: భారత్‌కు 10 దేశాల నుంచి 18 రాజకీయ పార్టీల నేతలు.. ఎందుకు వచ్చారంటే..
‘జనసేన’ గుర్తు... గాజు గ్లాసును ఇతరులకూ కేటాయిస్తే!? ఓట్లాటలో మాయోపాయానికి కచ్చితంగా తెరలేపినట్లే అవుతుంది. కూటమి ఓట్లను చీల్చే కుట్ర అమలు చేస్తున్నట్లే అనడంలో సందేహమే లేదు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఈ క్రమంలో దొంగాట మొదలుపెట్టింది. జనసేన అభ్యర్థులు లేనిచోట... జనసేన గుర్తయిన గాజు గ్లాస్‌ను స్వతంత్రులకు కోరి సాధించుకునేలా కుట్ర పన్ని ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో కామన్ సింబల్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజుగ్లాస్ గుర్తును ఇచ్చేలా చేసింది. అంటే... జనసేన తరఫున బరిలో ఉన్న అభ్యర్థులందరికీ ఇదే గుర్తును.. ఇండిపెండెంట్ అభ్యర్థులకు అదే గుర్తు.
AP Elections: మా ‘నవసందేహాలకు’’ సమాధానం చెప్పండి: వైఎస్ షర్మిల
వాస్తవానికి ఇండిపెండెంట్లకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన కొద్ది సేపటికే గుర్తుల కేటాయింపు జరగాలి. కానీ... సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయినా, రాత్రి పొద్దుపోయేదాకా పలుచోట్ల గుర్తుల కేటాయింపు ప్రక్రియ ముగియలేదు. అంటే... గ్లాసు గుర్తు కోరుకునే వారి కోసమే ఈ కాలయాపన చేశారనే అనుమానాలు తలెత్తాయి. చివరికి నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలోనూ ఒక అభ్యర్థికి గ్లాసు గుర్తు కేటాయించారు. దీంతో జనసేన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.
ఇవి కూడా చదవండి...
BRS: బీఆర్ఎస్కు గుర్తుల గుబులు..! రోడ్ రోలర్, చపాతి మేకర్ ఎఫెక్ట్ భయం
Delhi: ముస్లింలకే ఎక్కువ మంది పిల్లలుంటారా.. ప్రధాని మోదీ ఆరోపణలకు ఖర్గే కౌంటర్
Read Latest AP News And Telugu News