Share News

Janasena: గాజు గ్లాసు గుర్తుపై వర్ల రామయ్య వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ

ABN , Publish Date - May 02 , 2024 | 01:11 PM

గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా జనసేన పార్టీకి రిజర్వ్ చేయాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. గుర్తుల కేటాయింపు ప్రక్రియ ఏ దశలో ఉందో కనుక్కొని సాయంత్రం నాలుగు గంటలకు కోర్టుకు చెప్పాలని ఎలక్షన్ కమిషన్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Janasena: గాజు గ్లాసు గుర్తుపై వర్ల రామయ్య వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ

అమరావతి: గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా జనసేన పార్టీకి రిజర్వ్ చేయాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. గుర్తుల కేటాయింపు ప్రక్రియ ఏ దశలో ఉందో కనుక్కొని సాయంత్రం నాలుగు గంటలకు కోర్టుకు చెప్పాలని ఎలక్షన్ కమిషన్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ నాలుగు గంటలకు వాయిదా పడింది. ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వడం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని.. ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని ఈసీ తరుఫు న్యాయవాది వాదన వినిపించారు. నిన్న ఇచ్చిన వినతిని పరిగణలోకి తీసుకొని తగిన ఉత్తర్వులు ఇవ్వాలని వర్ల రామయ్య తరుపు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టును కోరారు.

AP Elections: రాజధాని నిర్మాణం చేసుకోలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నాం: పురందేశ్వరి


జనసేన పార్టీ గుర్తు కేటాయింపుపై ఆ పార్టీకి కొంత రిలీఫ్ అయితే నిన్న వచ్చింది. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులు ఎవరికి కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. జనసేన గుర్తుపై ఈ మేరకు ఈసీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటికే ఇచ్చిన ప్రాంతాల్లో రివ్యూ చేస్తామని ఈసీ అఫిడవిట్‌లో పేర్కొంది. మొత్తానికి జనసేనకు కాస్త రిలీఫే కానీ మొత్తానికి అయితే కాదు. ఇది పోటీ చేయని ప్రాంతాల్లో గ్లాస్ గుర్తు కేటాయించడమంటే కూటమికి నష్టం చేకూర్చడమే కదా? మరి దీనిపై ఈసీ ఏం చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి...

BRS MLAs : ప్రచారంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనాసక్తి?

TDP: టీడీపీ వర్గీయులపై కత్తులతో దాడి చేసిన వైసీపీ వర్గీయులు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2024 | 01:28 PM