Home » Godavari
గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం 54.4 అడుగులు దాటేసింది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్లకు రాకపోకలు నిలిచిపోయాయి.
ములుగు జిల్లాలో భారీ వర్షాలు, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష చేపట్టారు. వరద ఉధృతి తగ్గి పరిస్థితులు కుదుటపడుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో సహాయక కార్యక్రమాలను కొనసాగించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు గురువారం తగ్గుముఖం పట్టినప్పటికీ గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. గత కొన్నిరోజులుగా గోదావరి ప్రవాహం పెరుగుతూ, తగ్గుతూ ప్రజలను భయపెడుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు సీలేరు, శబరి, ఇంద్రావతి ఉపనదులు, కొండవాగుల జలాలు భారీగా గోదావరిలోకి
గత ఐదారు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి బాగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇక ధవళేశ్వరం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
భారీ వర్షాలతో జిల్లాలోని ప్రాణహిత, గోదావరి నదులకు వరద పోటు అధికంగా ఉంది. గోదావరి పుష్కర ఘాట్ల వద్ద 10.950 మీటర్ల ఎత్తులో ప్రాణహిత, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి.
చింతూరు మండలం కుయిగూరు వద్ద వరదలో బస్సు చిక్కుకుపోయింది. ఒడిషా నుంచి ఏపీకి ప్రయాణీకులతో ప్రయివేటు ట్రావెల్ బస్సు వస్తోంది. కుయిగూరు వాగు వంతెనపై వరద నీరు ఉన్నా దాటించేందుకు డ్రైవర్ ప్రయత్నం చేస్తున్నారు.
గోదావరి వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. భద్రాచలం దగ్గర ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 39.5 అడుగులుగా ఉంది. దిగువన శబరి నది పోటు వలన గోదావరి ప్రవాహం నిదానంగా మారింది.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. నేడు భద్రాచలం వద్ద నీటిమట్టం 43.9 అడుగులకు చేరుకోగా.. పోలవరం వద్ద 11.97 మీటర్లకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.48 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాబట్టి నేడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. పెద్దమొత్తంలో వరద ఉధృతి పోలవరానికి వచ్చి చేరుతోంది. గంట గంటకు గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద 30.680 మీటర్లకు నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్టు స్పిల్ వే నుంచి 3,15,791 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసింది
ఇండియాలోని పెద్ద నదుల్లో గోదావరి (River Godavari) ఒకటి. మహారాష్ట్రలో పుట్టి ఎన్నో ప్రాంతాలను దాటి బాసర వద్ద తెలుగు నేలపైకి అడుగిడుతుంది గోదారమ్మ.