Home » Goldsilver Price
బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి ధరల దిగి వస్తున్నాయి. రెండురోజుల్లో రూ.1300 వరకు తగ్గగా.. శుక్రవారం మరో రూ.100 తగ్గింది. అసలే శ్రావణ మాసం.. పెళ్లిళ్లు, ఫంక్షన్లతో మహిళలు బిజీగా ఉంటారు. బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
బంగారం కొనుగోలు చేయాలని అనుకునేవారికి శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర భారీగా తగ్గింది. నిన్న రూ.870 తగ్గిన ధర, ఇవాళ రూ.430 తగ్గింది. రెండురోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1300 వరకు తగ్గింది. గోల్డ్ రేట్ తగ్గడంతో మహిళా మణులు అన్ని పనులు మానుకొని మరి బంగారం షాపు వద్దకొస్తున్నారు.
శ్రావణమాసం అంటేనే మహిళలకు పండగ. అలాంటి వేళ.. పసిడి ధర దాదాపు వెయ్యి రూపాయిల వరకు తగ్గింది. అంతేకాదు.. బంగారం, వెండి ధరల్లో సైతం మార్పు చోటు చేసుకుంది. నిన్న అంటే మంగళవారం ఒక్క రోజే వీటి ధరల్లో ఊహించని మార్పు కనిపించిందని మార్కెట్ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు.
శ్రావణ మాసం శుభ కార్యాలకు నెలవు. ఇంట్లో ఏ శుభ కార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తారు. అలాగే ఎక్కడ శుభకార్యం జరిగినా.. గుళ్లు గోపురాలకు వెళ్లినా.. ఒంటి నిండా బంగారు నగలు ధరించి వెళ్లతారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మహిళలు.. మహారాణులు లాగా దర్శనమిస్తారు.
ఏడాదిలో అత్యంత శుభ్రప్రదమైన మాసాల్లో శావ్రణ మాసం ఒకటి. శుభకార్యాలకు నెలవైన ఆ మాసం నేటి నుంచి ప్రారంభమైంది. దీంతో పూజలు, వ్రతాలతో ప్రతి ఇల్లు కళకళలాడతాయి. దాంతో బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడనుంది. అదీకాక ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకం తగ్గించింది. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గాయి. దీంతో నాటి నుంచి వీటి కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
శ్రావణ మాసం వచ్చేస్తోంది. బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతోన్న సంగతి తెలిసిందే. పూజలు, వ్రతాలతో తెలుగు లోగిళ్లు కళకళ లాడతాయి. ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఉండటంతో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర పెరుగుతోంది.
బంగారం ధరలు కాస్త పెరిగాయి. సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఆ క్రమంలో గురువారం నుంచే ధరల పెరుగుదల ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆషాడ మాసం కావడంతో పసిడి ధర తగ్గుతూ.. పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే స్వల్ప తగ్గుదల నమోదైంది. వచ్చేది శ్రావణ మాసం అయినందున పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉన్నవారు ముందే బంగారం కొనుగోలు చేస్తున్నారు.
పసిడి ప్రియులకు అలర్ట్. బంగారం ధర కాస్త పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, శ్రావణ మాసం సమీపిస్తుండటంతో బంగారం ధరకు రెక్కలొస్తున్నాయి. శ్రావణ మాసంలో వ్రతాలు, నోములు, పూజలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉంటాయి. బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటినుంచే బంగారం ధర పెరుగుతూ వస్తోంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63, 240గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ. 68,990గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,240గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 68, 990గా ఉంది.