Share News

Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర

ABN , Publish Date - Jul 30 , 2024 | 07:53 AM

పసిడి ప్రియులకు అలర్ట్. బంగారం ధర కాస్త పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, శ్రావణ మాసం సమీపిస్తుండటంతో బంగారం ధరకు రెక్కలొస్తున్నాయి. శ్రావణ మాసంలో వ్రతాలు, నోములు, పూజలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉంటాయి. బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటినుంచే బంగారం ధర పెరుగుతూ వస్తోంది.

Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర
Gold Rates

హైదరాబాద్: పసిడి ప్రియులకు అలర్ట్. బంగారం ధర కాస్త పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, శ్రావణ మాసం సమీపిస్తుండటంతో బంగారం ధరకు (Gold Rates) రెక్కలొస్తున్నాయి. శ్రావణ మాసంలో వ్రతాలు, నోములు, పూజలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉంటాయి. బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటినుంచే బంగారం ధర పెరుగుతూ వస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తగ్గిన పసిడి ధర.. మంగళవారం నుంచి పెరగడం ప్రారంభమైంది.


స్వల్పంగా పెరిగిన ధర

దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర యావరేజిగా రూ. 69,170గా ఉంది. నిన్న (సోమవారం) అది 69,140గా విక్రయించారు. బంగారంతోపాటు వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ.100 వరకు పెరిగింది. బంగారం, వెండి సహా పలు ఉత్పత్తులపై ప్రభుత్వం కస్టమ్స్ సుంకం తగ్గించిన సంగతి తెలిసిందే.


సిటీలో ఇలా

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,410గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.69,170గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,410గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,170గా ఉంది. ఢిల్లీ, ముంబై, పుణెలో కిలో వెండి ధర రూ.84,400కి చేరింది. చెన్నై, హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.88,900గా ఉంది.


ఢిల్లీ, ముంబై

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,550గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,320గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,400గా పలికింది. మేలిమి బంగారం ధర రూ.69, 170గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,140గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.69, 970గా ఉంది. బెంగళూర్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,410గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.69,170గా ఉంది.

Updated Date - Jul 30 , 2024 | 10:21 AM