Home » Golkonda Bonalu
శ్రీ జగదాంబ మహాకాళి అమ్మవారి బోనాల సందర్భంగా గోల్కొండ(Golconda) పరిసర ప్రాంతాల్లో ఈనెల 14న ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్(Traffic Additional CP Vishwaprasad) పేర్కొన్నారు.
భాగ్యనగరంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నెలరోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేదమంత్రాలు, ఊరేగింపులు, శివసత్తులు, పోతరాజుల నృత్యాలతో ఆదివారం చారిత్రక గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలకు శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్: ఆషాఢమాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ జగదాంబిక మహంకాళీ ఎల్లమ్మ బోనాలు గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆదివారం లంగర్‌హౌజ్ చౌరస్తాలో ప్రారంభమయ్యాయి.
గోల్కొండ బోనాల సందర్భంగా గోల్కొండ(Golconda)కు వెళ్లే దారుల్లో వాహనాలను అనుమతించబోమని, భక్తులు కేటాయించిన ప్రదేశాల్లోనే పార్కింగ్ చేసుకోవాలని అడిషనల్ సీపీ పి.విశ్వప్రసాద్(Additional CP P. Vishwaprasad) తెలిపారు.
ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులతో గోల్కొండ పరిసరాలన్నీ కిటకిటలాడుతూ, సందడిగా మారిపోతాయి. ఈ ఏడాది జూలై ఏడో తారీఖున ఆదివారం నాడు గోల్కొండ బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి.