Golconda Bonalu: హైదరాబాద్‌లో బోనాల సందడి..
ABN , Publish Date - Jul 07 , 2024 | 12:16 PM
హైదరాబాద్: ఆషాఢమాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ జగదాంబిక మహంకాళీ ఎల్లమ్మ బోనాలు గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆదివారం లంగర్‌హౌజ్ చౌరస్తాలో ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్: ఆషాఢమాసం బోనాల ఉత్సవాలను ( Bonala Festivals) పురస్కరించుకుని భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ జగదాంబిక మహంకాళీ (Golconda Jagadambika Mahankali) ఎల్లమ్మ బోనాలు (Ellamma Bonalu) గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆదివారం లంగర్‌హౌజ్ చౌరస్తాలో ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.) తరఫున మంత్రులు బోనాలను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు. అక్కడి నుంచి పట్టు వస్త్రాల ఊరేగింపు, తొట్టెల ఊరేగింపు గొల్కొండ కోట వరకు కొనసాగాయి. ఈ కార్యక్రమం మొత్తం దేవాదాయ ఆధ్వర్యంలో జరిగింది.. బోనాల నిర్వహణ ఖర్చు కోసం ప్రభుత్వం తరఫున రూ. 11లక్షల చెక్‌ను మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), కొండా సురేఖ (Konda Surekha), గోల్కొండ ఈవో శ్రీనివాస రాజు (Srinivasa Raju) ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశారు.
గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారి ఆలయంలో ఆదివారం జరిగే వేడులకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం, ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు నేతలు హాజరయి పట్టువస్త్రాలు సమర్పించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు అద్దం పట్టే విధంగా ఆషాఢ బోనాల వేడుకలను ఆర్భాటంగా నిర్వహించేందుకు విస్త్రత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. కాగా గోల్కొండలో జరిగే బోనాల ఉత్సవాలకు గవర్నర్ రాధాకృష్ణన్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై రాజ్‌భవన్ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.
కాగా ఆదివారం నుంచి ప్రతి ఆదివారం, ప్రతి గురువారం.. గోల్కొండ అమ్మవారికి భక్తులు మొత్తం 9 పూజలు నిర్వహిస్తారు. ఈ నెల 21న సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి బోనాల వేడుకలు జరుగుతాయి. 28న, ఓల్డ్ సిటీ లాల్ దర్వాజ సింహవాహిని మహాంకాళీ అమ్మవారి బోనాలు జరుగుతాయి. గోల్కొండలో మొదలైన బోనాల ఉత్సవాలు ఆగస్టు 4 న గోల్కొండలోనే ముగియనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్?
ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్ఐ.. చికిత్స పొందుతూ మృతి..
తండ్రి బాటలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి
తాడేపల్లి ప్యాలెస్ ప్రహరీ గోడ ఖర్చు 10 కోట్లు..!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News