Home » Group-1
బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి నగరంలోని అశోక్ నగర్ లైబ్రరీకి బండి సంజయ్ భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఇందులో సంజయ్ తో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ను కలిసిన గ్రూప్-1 బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు.
రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దించేయాలని కాంగ్రెస్ మంత్రులు, నాయకులు కుట్రలు చేస్తున్నారని, తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
ఈనెల 21 నుంచి జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని, జీవో 29ను రద్దు చేయాలని ర్యాలీ నిర్వహిస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ పోగుల రాంబాబు అనే అభ్యర్థి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు ఊరట. మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఉన్న అడ్డంకులను హైకోర్టు తొలగించింది.
Telangana Group 1 Aspirants: తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థులకు బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్.
Telangana: గ్రూప్ -2, గ్రూప్ -1 మెయిన్కు ఎంపిక అయిన వారిని గ్రూప్ 4 నుంచి వెంటనే అన్ లివింగ్ చేయాలని గ్రూప్-4 ఉద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేశారు. పెద్ద పోస్ట్లలో ఉన్న వారు అన్ లివింగ్ ఆప్షన్ ఇవ్వాలన్నారు. వారి పోస్ట్లు వచ్చి వెళ్లిన తర్వాత బ్యాక్ లాగ్లుగా ఉంచవద్దని.. దీని వల్ల వెనకున్న అభ్యర్థులు నష్టపోతారని వాపోయారు.
Telangana: జీవో 29 ని రద్దు చేయాలంటూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. జీవో 29 వల్ల జరిగే నష్టాన్ని ప్రధాన న్యాయమూర్తికి తమ న్యాయవాది వివరించారని అభ్యర్థులు తెలిపారు. సోమవారం (అక్టోబర్ 21) రోజు మొదటి కేసుగా తీసుకొని విచారిస్తామని వాయిదా వేసినట్లు చెప్పారు.
ఈ నెల 21 నుంచి 27 వరకు జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు.
గ్రూప్-1 నోటిపికేషన్లను సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించినప్పటికీ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. గ్రూప్-1 నోటిఫికేషన్లు సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ.. గ్రూప్-1 మెయిన్ పరీక్షలకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈనెల 18వ తేదీ నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. కోర్టు ద్వారా చేసిన ..