Share News

Group -1 candidates: తెలంగాణ హైకోర్టులో గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్

ABN , Publish Date - Mar 24 , 2025 | 04:22 PM

Group 1 candidates: గ్రూప్-1 మెయిన్స్ రీవాల్యుయేషన్ జరపాలంటూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 3 భాషల్లో పరీక్ష జరిగినా తగిన నిపుణులతో దిద్దించలేదని గ్రూప్-1 అభ్యర్థులు తెలిపారు.

Group -1 candidates: తెలంగాణ హైకోర్టులో గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్
Group 1 candidates

హైదరాబాద్, మార్చి 24: గ్రూప్-1 అభ్యర్థులు (Group -1 Candidates) తెలంగాణ హైకోర్టును (Telangana High Court) ఆశ్రయించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ జరిపించాలంటూ హైకోర్టులో అభ్యర్థులు పిటిషన్ వేశారు. గ్రూప్‌ 1 మెయిన్స్ రీవాల్యుయేషన్‌ జరిపించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. గ్రూప్‌ 1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని పిటిషనర్లు తెలిపారు. 18 రకాల సబ్జక్టులుంటే 12 సబ్జక్టుల నిపుణులతోనే దిద్దించారన్నారు. 3 భాషల్లో పరీక్ష జరిగినా తగిన నిపుణులతో దిద్దించలేదని వెల్లడించారు. ఒకే మాధ్యమంలో నిపుణులైన వారితో రెండు భాషల (తెలుగు, ఇంగ్లీష్) పేపర్లు దిద్దించచారని.. దీంతో మూల్యాంకణంలో నాణ్యత కొరవడిందన్నారు.


తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్లు చెప్పుకొచ్చారు. పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు.. టీజీపీఎస్సీకి (TGPSC) నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్‌ వేయాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-1 మెయిన్స్‌పై తదుపురి విచారణను హైకోర్టు ధర్మాసనం నాలుగు వారాలకు వాయిదా వేసింది.


కాగా.. ఈనెలలోనే (మార్చి) గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలతో పాటు గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాలను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 10, 11 తేదీల్లో గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్-2 రాత పరీక్షల మార్కులు విడుదలయ్యాయి. అలాగే మార్చి 14న గ్రూప్-3 ఫలితాలను కూడా టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి గాను.. గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు గ్రూప్-1 పరీక్షలు జరిగాయి. ఈ మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అలాగే గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు మొత్తం 2.36 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక 1,365 గ్రూప్-3 సర్వీస్‌ల పోస్టుల భర్తీ కోసం రాత పరీక్షలు నిర్వహించింది టీజీపీఎస్సీ. గత ఏడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో గ్రూప్-3 రాత పరీక్షలు జరిగాయి. ఈనెల 14న గ్రూప్-3 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది.


ఇవి కూడా చదవండి...

Attack On Bollywood Actress: షాప్‌ ఓపెనింగ్‌కు వచ్చిన బాలీవుడ్ నటికి ఊహించని షాక్

Hyderabad Explosion: హైదరాబాద్‌లో భారీ పేలుడు... ఏం జరిగిందంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 24 , 2025 | 04:57 PM