Home » Gulf News
కూడు,గూడు, గుడ్డ మానవాళి కనీస మౌలిక అవసరాలు. మనిషి సగటు జీవితం వీటి చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. ఆ అవసరాలను సంతృప్తికరంగా తీర్చుకోవడానికై మనిషి సప్త సముద్రాలను కూడా దాటుతాడు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ప్రజలకు ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి తెలిసిన పోలీస్ అధికారైనా ఉండాలి..లేదా ఎమ్మెల్యే సొంత కులం అయినా ఉండాలి..ఇక్కడ రాజకీయాల్లో కౌన్సిలర్ కూడా బెదిరిస్తాడని జనసేన(Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు.
ప్రవాస భారతీయు (ఎన్ఆర్ఐ)ల్లో 66% మంది గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
సౌదీలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. మరో ఫ్రెండ్‌తో కలిసి వెళ్తుండగా కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కనున్న ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఇబ్రహీం, హసన్ అక్కడికక్కడే మరణించారు. మరో విద్యార్థి అమ్మార్ పరిస్ధితి విషమంగా ఉంది. కాగా.. అమ్మార్, ఇబ్రహీంలు అన్నాదమ్ముళ్లు కావడం గమనార్హం. ఇబ్రహీం గురువారం హైదరాబాద్‌కు రావాల్సి ఉండగా ఈ ఘోరం జరిగింది.
సంపద ఎంత ముఖ్యమో, దాన్ని వినియోగించే విధానం కూడా అంతే ముఖ్యం. కుటుంబం, రాష్ట్రం లేదా దేశం ఏదీ ఇందుకు మినహాయింపు కాదు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాసుపల్లి రాంబాబు అనే ఓ తెలుగు యువకుడు సౌదీలో జైలు పాలయ్యాడు. భారత్‌లోని డాక్టర్లు వాడమన్న ట్రామాడోల్ ట్యాబ్లెట్‌ను సౌదీకి వెళ్లినా వాడుతోంటే.. ఆ మాత్రలే అతడిని జైలు పాలు చేశాయి. ఆ తర్వాత అతడిని బెయిల్ పై విడుదల చేసినా.. సౌదీ దాటి వెళ్లకుండా ఆంక్షలు విధించడంతో అతడు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. ఏపీఎన్నార్టీ కోఆర్డినేటర్ సాయంతో ఎట్టకేలకు సమస్య పరిష్కారమయింది.
సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలోని ఒక ఫర్నిచర్ పరిశ్రమ మూతబడడంతో అందులో పని చేస్తున్న సుమారు 150 మంది భారతీయులు రోడ్డున పడ్డారు. తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్న ఆ భారతీయులను ఆదుకోవడానికి రియాధ్ నగరంలోని తెలుగు ప్రవాసీయులు ముందుకు వచ్చారు. రెండు నెలలకు సరిపడా ఆహార సామాగ్రిని ఆ ప్రవాసులకు అందించారు.
సొంతూరికి తీసుకెళ్లాల్సిన ప్రవాస భారతీయుడి మృతదేహం గురించి ఒకరు.. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు అందాల్సిన బకాయిల గురించి మరొకరు.. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌తో సమస్యలను చెప్పుకున్నారు.
విదేశాల్లో పని చేస్తున్న భారతీయులు (Indians) బాగానే సందపదిస్తున్నారు.
ఈద్ అల్ ఫితర్ (Eid Al Fitr) కోసం అరబ్ దేశాల నివాసితులు సన్నద్ధం అవుతున్నారు.