NRI: వామ్మో.. ఆ ఎన్నారైల సంపాదన 500 శాతం పెరుగుదల!
ABN , First Publish Date - 2023-04-27T09:58:19+05:30 IST
విదేశాల్లో పని చేస్తున్న భారతీయులు (Indians) బాగానే సందపదిస్తున్నారు.
ఎన్నారై డెస్క్: విదేశాల్లో పని చేస్తున్న భారతీయులు (Indians) బాగానే సందపదిస్తున్నారు. ప్రవాస భారతీయుల (Indian Expats) ఆదాయంలో 120 శాతం మేర పెరగుదల కనిపించిందని ప్రపంచ అభివృద్ధి నివేదిక-2023 వెల్లడించింది. అమెరికాకు వలస వెళ్లిన తక్కువ నైపుణ్యాలు గల భారతీయుల (Low Skilled Indians In US) ఆదాయంలో ఏకంగా 500 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. ఈ వృద్ధి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) 300 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. కాగా, ఇతర గల్ఫ్ దేశాల్లో భారతీయుల ఆదాయంలో తక్కువ వృద్ధి నమోదైందని నివేదిక తెలిపింది. అయితే, అంతర్గత వలసలతో పోలిస్తే ఈ పెరుగుదల భారీగా ఉందట.
ఇక సిలికాన్ వ్యాలీకి వలస వెళ్లే వైద్యులు లేదా టెక్ వర్కర్లు వంటి అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులకు సంపాదన వృద్ధి చాలా ఎక్కువగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. అలాగే తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులు సైతం ఇంతకుముందెన్నడూ చూడని విధంగా భారీ పెరుగుదలను చూస్తారని తెలిపింది. మరోవైపు సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమాన్, ఖతార్, కువైత్ కూడిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (Gulf Cooperation Council) దేశాలకు వలస వెళ్ళేవారికి తక్కువ వృద్ధి ఉంటుందని తెలియజేసింది.
US Road Accident: అగ్రరాజ్యంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాదీ విద్యార్థులు దుర్మరణం!
కాగా, ప్రపంచవ్యాప్తంగా 184 మిలియన్ల మంది వలసదారులు ఉంటే.. 37 మిలియన్ల మంది శరణార్థులు ఉన్నారని నివేదిక వెల్లడించింది. వీరిని నాలుగు వర్గాలుగా విభజించింది. 1. బలమైన నైపుణ్యం కలిగి ఉన్న ఎకనామిక్ వలసదారులు (యుఎస్‌లోని భారతీయ ఐటీ నిపుణులు లేదా జీసీసీ దేశాలలో నిర్మాణ కార్మికులు), 2. డిమాండ్ ఉన్న నైపుణ్యాలు కలిగిన శరణార్థులు (తుర్కీయేలో సిరియన్ వ్యవస్థాపక శరణార్థులు), 3. కష్టాల్లో ఉన్న వలసదారులు (యూఎస్ దక్షిణ సరిహద్దు వద్ద నైపుణ్యం కలిగిన వలసదారులు), 4. శరణార్థులు (బంగ్లాదేశ్‌లోని రోహింగ్యాలు). ఇక నివేదిక అంచనా ప్రకారం ఇండియా-యుఎస్, ఇండియా-బంగ్లాదేశ్, ఇండియా-జీసీసీ అగ్ర వలస కారిడార్‌లుగా పరిగణించబడ్డాయి.